*ఎస్సీ కాలనీలో జాషువా 54వ వర్ధంతి వేడుకలు
Prabhakar Rao:ప్రజా దీవెన, కోదాడ: ఆధునిక తెలుగు కవులలో గుర్రం జాషువా స్థానం పదిలమని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం (SC ST Teachers Association) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకర్ రావు (Prabhakar Rao)అన్నారు తెలుగు సాహితీ దిగ్గజం దళిత కవి గుర్రం జాషువా 54 వర్ధంతిని పురస్కరించుకొని బయ్యారపు రామారావు ఆధ్వర్యంలోబుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక జాషువా నగర్ (ఎస్సీ కాలనీ) లో జాషువా వర్ధంతి (Joshua died) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభాకర్ రావు పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడారు ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన గుర్రం జాషువా గొప్ప కవి అని కొనియాడారు.
సమకాలిక కవిత్వ వరవడియైన భావ కవిత్వం రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు రాశాడని గుర్తు చేశారు జనమంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం అందరం అనుకుంటే కాగలదు మరో స్వర్గం అని జాషువా కవితను గుర్తు చేశారు అలాగే హుజూర్నగర్ మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రావణ్ (sharavan)బయ్యారపు రామారావు జాషువా కవితలను చదివి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చితిర్యాల నాగయ్య ఎడవెల్లి వీరబాబు కస్తాల సైదులు మేళ్లచెరువు లక్ష్మయ్య కస్తాల రాఘవులు మేరిగ వీరబాబు మేళ్లచెరువు నాగార్జున్ ప్రసాద్ రావు నవీన్ నాగేష్ పల్లె క్రాంతి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు