–ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెల్లడి
Prabhakar Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)కేసు విచారణకు తన హాజ రుకు సంబంధించి రాసిన లేఖ ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు ప్ర భాకర్ రావు రాసిన లేఖలో పోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్ కు రావా ల్సింద ని ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివ రించారు. క్యాన్సర్, గుండె సంబం ధిత వ్యాధులతో బాధపడుతు న్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచ నతో అక్కడే చికిత్స పొందు తున్నట్లు లేఖలో ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
నాపై అసత్య ఆరోప ణలు చేస్తూ మీడియాకు (media)లీకులు ఇస్తున్నారని, నేను నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడు తున్నామని, ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదని, చట్టపరంగా విచారణ జరిపించాలని కోరు తున్నానని ప్రభాకర్ రావు (Prabhakar Rao)లేఖలో (letter) కోరారు. దర్యాప్తులో పోలీసుల కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా నని, టెలీకాన్ఫరెన్స్, మెయిల్ ద్వా రా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధ మని, నా దృష్టికి వచ్చిన సమాచా రాన్ని విచారణాధి కారికి చెబుతాన ని ప్రభాకర్ రావు లేఖలో చెప్పుకొ చ్చారు. క్రమశిక్షణ గల అధికారినని విచారణ ఎదుర్కొంటానని ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని, పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ప్రభాకర్ రావు (Prabhakar Rao) లేఖలో విన్నవించుకున్నారు.