ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి
Prabhakar Reddy : ప్రజా దీవన, నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి జనగాం ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కబడ్డీ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయని క్రీడలతో స్నేహబంధం ఏర్పడుతుందని అన్నారు. అదేవిధంగా యువత క్రీడల్లో రాణించాలని కోరారు.కబడ్డీ పోటీల్లో పాల్గొనీ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి వెంకం భావితండ ద్వితీయ బహుమతి మర్రిబాయి తండా,తృతీయ బహుమతి జనగాం జట్లు విజేతలుగా నిలిచాయి.విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నగదు తో పాటు షీల్డు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేష్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్,మాజీ సింగిల్ విండో చైర్మన్ గడ్డం మురళీధర్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్రి నరసింహ,జనగాం ప్రీమియర్ లీగ్ సీజన్ 2 వ్యవస్థాపక అధ్యక్షులు బైకని సైదులు,గ్రామ శాఖ అధ్యక్షులు ఎదటి తిరుమలేష్, నారాయణపూర్ మండలం బిఆర్ఎస్ యువజన ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్,మాజీ ఎంపీటీసీ గడ్డం పెంటయ్య,నాయకులు గడ్డం ముత్యాలు,మాజీ వార్డు సభ్యులు బెల్లంకొండ నర్సింహ,మంచాల బాలరాజు,తండా యాదయ్య, సాయికుమార్,చుక్క కళ్యాణ్,ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.