Prabhavati : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పెట్టుబడి దారులుకు దోచిపెట్టి పేద ప్రజలకు వ్యతిరేక రేఖమైన బడ్జెట్ కు నిరసనగా ఈ నెల 10న ఇంది రపార్క్ హైదరాబాద్ లో జరిగే నిర సన ధర్నా ను జయప్రదం చేయా లనీ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ఐద్వా పట్టణ కమిటీ సమావేశం నుస్రత్ అధ్యక్షతన సుం దరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడు తూ ఇది మహిళా సంక్షేమ బడ్జెట్ కాదు కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్ సబ్ కా వికాస్ అని చెప్తు న్నారు. మహిళలకు మేలు జరిగే బడ్జెట్ కాదు మహిళా సంక్షేమానికి, ప్రజలు సంక్షేమానికి బడ్జెట్ కేటా యింపులు తగ్గించారు. దీన్నిబట్టి చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజ ల సంక్షేమం పట్ల, మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నా రు. జెండర్ బడ్జెట్ సంబంధించిన కేటాయింపులు తక్కువగా ఉన్నా యి. మహిళా శిశు సంక్షేమానికి మొత్తం బడ్జెట్ 0.53% మాత్రమే కేటాయించారని అన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద తప్ప ఏ స్కూలుకు కేటాయింపులు పెం చలేదని మహిళలపై హింసకు వ్య తిరేకంగా వారి పునరావాసానికి సంబంధించిన కేటాయింపులో 50 శాతం వరకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చాలా అన్యా యం అని అన్నారు. ఇప్పటికే ఐదు సంవత్సరంలోపు పిల్లలు పౌష్టికా హారం లోపంతో చనిపోతున్నారని గర్భిణీ స్త్రీలలో కూడా రక్తహీనత ఉందని అన్నారు. పౌష్టికాహారం సంబంధించిన బడ్జెట్లో ఆహార సబ్సిడీలో 2023-24 కంటే 8394 కోట్లు తగ్గించారు. ఇదెక్కడ అన్యా యం అని అన్నారు. అంగన్వాడీల కు లాస్ట్ ఇయర్ కంటే మూడు శాతం తగ్గించారని పౌష్టికాహారం అందిస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మూడు శాతం మాత్రమే పెంచిందని అన్నారు. ఈ బడ్జెట్లో 21,960 కోట్లు అంగన్వాడికి కేటా యించారు. మిగిలిన 6000 కోట్లు బడ్జెట్ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు, మహిళల అభి వృద్ధికి న్యాయం జరుగుతుందా అని విమర్శించారు. 10న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో మహిళ లు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరా రు. ఐద్వా పట్టణ కార్యదర్శి భూ తం అరుణకుమారి మాట్లాడుతూ నిత్యం మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాల గురించి ఈ సమావేశంలో చర్చిస్తూ ఐద్వా మహిళలకు ఎల్లవేళలా తోడు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యార్థి యువకులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమ స్యలపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు బిజెపి ప్రభుత్వం ప్రవేటు పెట్టుబడులు ప్రోత్సహించడమే నిరుద్యోగ సమస్యలకు పరిష్కార మని అనుకుంటున్నారు ఆర్థిక మంత్రి చిన్న చిన్న కంపెనీలను ప్రోత్సహించడం వలన ఉపాధి పెరుగుతుంది అంటున్నారు కానీ 48 శాతం చిన్న మధ్య తరగతి పరిశ్రమలు మూతపడ్డాయి.
ఈ కార్యక్రమంలో కనుకుంట్ల ఉమారాణి,కుంభం లక్ష్మమ్మ, నుష్రత్ ఉన్నిస్సా,చినపాక మంజుల,బోరుగొండ్ల నాగమణి అస్మా, ఆండాళ్ తదితరులు పాల్గొన్నారు.