ప్రజా దీవెన, కోదాడ హుజూర్నగర్ ,కోదాడ నియోజకవర్గ లలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందాం ఏ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో బుధవారం సందర్శించారు. కోదాడ నియోజకవర్గంలోని తొగరాయి, హుజూర్నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ ,చౌటపల్లి ,మఠంపల్లి ప్రాంతాలలో వరదల వల్ల కొట్టుకుపోయిన ట్యాంకులను, రోడ్లను బృందం పరిశీలించారు.
హుజూర్నగర్ నందు బూరుగడ్డ గ్రామంలో గల నల్లచెరువు ట్యాంకును, చౌటపల్లిలోని ఊర చెరువు ట్యాంకులు ,మఠంపల్లి లోని మామిళ్ళ చెరువును బృందం పరిశీలించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సభ్యులకు వివరించారు. బూరుగడ్డ లోని నల్లచెరువు తెగిపోవడం వలన 1570 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని సుమారు 360 ఎకరాలు వరదల వల్ల కొట్టుకుపోయాయని అగ్రికల్చరల్ ఏవో వివరించారు.
సెప్టెంబర్ లలో వచ్చిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలతో జరిగిన పంట నష్టం గురించి రోడ్లు ,ఇరిగేషన్ ట్యాంకులు, నీట మునిగిన గృహాల గురించి వరదల వల్ల చనిపోయిన పశువులు ,ప్రాణా నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బృందానికి వివరించారు. జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన సభ్యులు సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని అలాగే రైతులకు అనుబంధ శాఖలైన ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, అగ్రికల్చర్ ,హార్టికల్చర్లలో నష్టం జరిగినట్టు బృందం అంచనా వేశారు. పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని జరిగిన నష్టానికి ఎంత పరిహారం అవసరమో నివేదిస్తామని తెలిపారు.
ఏ నిపుణుల బృందంలో పవన్ స్వరూప్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శివ చిదంబరం సీనియర్ సైంటిస్ట్ కనుగొ చీఫ్ సైంటిస్ట్ అజయ్ చౌరస్య చీఫ్ సైంటిస్ట్ కె విజయకుమార్ ఈఎన్సీ ఇరిగేషన్ షేక్ ఇమామ్ పంచాయతీరాజ్ ఎస్ఎం సుభాని అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ రచన అర్బన్ సెక్టార్ సభ్యులు శాఖల వారీగా కోదాడ హుజూర్నగర్ లో పర్యటించారు.
ఈ పర్యటనలో ఆర్ అండ్ బి ఈ సీతారామయ్య ఆర్టీవో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ , హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు , హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ డి ఈ రామకిషోర్ ఆర్ అండ్ బి డి పవన్ తాసిల్దార్ పద్మ హుజూర్నగర్ తాసిల్దార్ కే నాగేందర్ స్వామి కోదాడ తాసిల్దార్ వాజీద్ అలీ అధికారుల సిబ్బంది పాల్గొన్నా రు.