Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bribe: పంచాయతీరాజ్ లో అవినీతి చేప

లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లు రాక ఏళ్ళ తరబడి తిరిగి వేసారి పోతున్న కాంట్రాక్టర్లకు అధికారుల అవినీతి(Corruption) మరింత తలనొప్పిగా మారింది.

రూ. 7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పి ఆర్ ఎ ఈ
ప్రజలు ధైర్యంగా సమాచారం ఇవ్వాలంటున్న ఏసీబీ డిఎస్పి రమణమూర్తి

ప్రజా దీవెన, రాజన్న సిరిసిల్ల: లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లు రాక ఏళ్ళ తరబడి తిరిగి వేసారి పోతున్న కాంట్రాక్టర్లకు అధికారుల అవినీతి(Corruption) మరింత తలనొప్పిగా మారింది. స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లుల(Contractor’s Bills) కోసం పంచాయతీ రాజ్ కార్యాల యం చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయాడు. బిల్లులు పై అధికారు లకు పంపాలంటే రూ. 8వేల రూపా యలు లంచం ఇస్తేనే పనవుతుం దంటూ పంచాయతీరాజ్ ఏ.ఈ తెలపడంతో చివరకు కాంట్రాక్టర్ ఏసీబీని(ACB) ఆశ్రయించారు. సోమవా రం రోజున కలెక్టరేట్లోని పంచాయతీ రాజ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుం టుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు.

ఏసీబీ డీఎస్సీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారo రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ వెంకటేష్ బిల్లుల కోసం పంచాయతీరాజ్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నాలుగు నెలల క్రితం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మొత్తం పంచాయతీరాజ్ ఎ, ఈ,భాస్కర్ రావుకు అందజేశారు. ఏ ఈ,భాస్కర్ రావు ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తేనే ఎంబి చేస్తానంటూ తెలపడంతో నివ్వెర పోయిన కాంట్రాక్టర్ వెంకటేష్ అంత ఇచ్చుకోలేనంటూ బతిమిలాడడం తో 7000 రూపాయలకు తగ్గించా డు.

తన వేధిస్తున్న అధికార తీరుపై ఏసీబీ(ACB) అధికారులకు వెంకటేష్ ఫిర్యాదు చేయడంతో కలెక్టరేట్ సముదాయంలోని పంచాయతీ రాజ్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన అధికారులు 7వేల రూపాయలు లంచం తీసుకుం టుండగా ఏఈ ,భాస్కర్ రావు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. భాస్కరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరుచున్నట్లు ఉన్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు. అధికారులు లంచం కోసం వేధిస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

PRAE caught by ACB while taking 7000 bribe