Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prajadeveena : పాఠకులకు చేరువలో ప్రజా’ దీవెన’

--క్యాలెండర్ ఆవిష్కరణలో ఎస్పీ శరత్ చంద్రపవార్

పాఠకులకు చేరువలో ప్రజా’ దీవెన’

–క్యాలెండర్ ఆవిష్కరణలో ఎస్పీ శరత్ చంద్ర పవార్

Prajadeveena:  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పాఠ కులకు అభిరు చికి అనుగుణంగా అప్రతిహతంగా ప్రజా దీవెన డిజిటల్ దినపత్రిక ముందుకు సాగుతోoదని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరిం చుకొని ప్రజా ‘దీవెన ‘2025 నూత న సంవత్సర క్యాలెండర్ ను శుక్ర వారం ఎస్పీ కార్యాలయంలో ప్రజా దీవెన పత్రిక బ్యూరో చీఫ్, జిల్లా జర్న లిస్టు యూనియన్ అధ్యక్షుడు గుండగోని జయశంకర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీడియా రంగంలో ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పత్రికారంగo నిర్దిష్ట నియమావళి ప్రకారం డిజిటల్ మీడియా తనకు తానుగా లైన్ నిర్దేశించుకుని మంచి విలువలతో ముందుకు సాగాలని సూచించా రు. ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల వార్తలు అతితక్కువ సమ యంలో సమాజానికి అందిస్తున్న ప్రజా దీవెన మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రజా దీవెన వెబ్ సైట్ లో జిల్లా సమగ్ర సమాచారమే కాకుండా రాష్ట్ర స్థాయి వార్తలను ఎప్పటిక ప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొ స్తున్నందుకు ఆయన ప్రజా దీవెన యాజమాన్యం, సిబ్బందిని అభినందించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నల్లగొం డ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ లు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ గుండగోని జయ శంకర్ ఆధ్వర్యం లో వెలువడుతున్న ప్రజా దీవెన డిజిటల్ దినపత్రిక, వెబ్ సైట్ దినది నాభివృద్ధి చెంది మరింత బలోపేతంతో ముందుకు సాగాలని ఆకాం క్షించారు. మధ్యతరహా పత్రికగా కొనసాగుతున్న ప్రజా దీవెన ప్రధాన మీడియా రంగాలకు తీసిపోకుండా వార్తల కవరేజి విషయంలో సక్సె స్ ఫుల్ గా ముందుకు సాగుతున్నందుకు యాజమాన్యo, సిబ్బందిని అభినందించారు.

ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో ఇంచార్జ్ మధు అ ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికు మార్, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి ఉబ్బని సైదులు, వెంకట్ రెడ్డి, స ల్వాది జానయ్య, వీడియో జర్న లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లి మల్లేష్ యాదవ్, జానీ, ముచ్చర్ల శ్రీనివాస్, రాజు, బోగారి రామకృష్ణ, కత్తుల హరి, స్వామీ, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ మున్సిపాలిటీలో.. ప్రజా దీవెన డిజిటల్ దినపత్రిక 2025 క్యాలెండర్ ను నల్లగొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, గణే ష్, మోహన్ బాబు, కలీల్ తదితరులు పాల్గొన్నారు.