Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pramila Ramesh: వరద సహాయక చర్యలు ముమ్మరం చేశాం.

*రాత్రంతా నిద్రహారాలు లేకుండా అధికార యంత్రంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చాం.
*మరో రెండు రోజులు వర్ష ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అక్రమ కట్టడాలు వాగులు ఆక్రమించడం వల్లే ఈ దుస్థితి.
రేపు మంత్రి ఉత్తమ్ వరద ప్రాంతాల సందర్శనకు రాక.

Pramila Ramesh: ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏర్పడిన వరద బీభత్సాన్ని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా సహాయక చర్యలను ముమ్మరం చేశామని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ (Pramila Ramesh) అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమాదేవితో కలిసి  ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్న రాత్రి 7 గంటల నుండి పట్టణంలో పలు వార్డులతోపాటు ప్రధాన రహదారిపై వరదనీటి ఉధృతిని తగ్గించేందుకు మున్సిపల్ సిబ్బంది పోలీస్ యంత్రాంగం (Police Department) రాత్రి నిద్రాహారాలు మాని సహాయక చర్యలకు తీవ్రంగా కృషి చేశామన్నారు.

వరద నీరు ఇళ్లలోకి రాకుండా జెసిబిలు అన్నింటిని సమకూర్చి డివైడర్లను వరద నీరు వెళ్లకుండా అడ్డుకునే కట్టలను తొలగించి నీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేశామన్నారు. వరద కారణంగా ఎంత చెప్తున్నా వినకుండా ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి చనిపోవడం ఎంతో బాధాకరం అన్నారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్పఇంటి నుంచి బయటకు రావద్దు అన్నారు. వరద  బాధితులకు పునరావాసం కోసం పట్టణంలో టిటిడి కళ్యాణమండపం (TTD Kalyanamandapam,), గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్, బాలుర ఉన్నత పాఠశాల సిసి రెడ్డి పాఠశాలలో పునరావాసం కేంద్రాలుగా సిద్ధం చేశామని ఆహారం అన్ని సౌకర్యాలు కల్పించామని ఎవరికి ఇబ్బంది ఉన్నా కేంద్రాలకు రావచ్చు అని పిలుపునిచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరద బీభత్సం జరిగిందని ప్రభుత్వ భూములను, వాగులను, వంకలను, చెరువులను కాపాడేందుకు కొడ్రా  ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

రేపు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ఉదయం 8 గంటలకు కోదాడలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు హాజరవుతున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ప్రజలకు పూర్తిగా అండగా ఉంటామని ఆమె వెల్లడించారు. అత్యవసర సమయంలో తన నెంబర్  గాని హెల్ప్ లైన్ నెంబర్ (Help line no) గాని సంప్రదించాలని కోరారు.