Prasad : ప్రజా దీవెన, శాలిగౌరారం: లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్-2 కేవి ప్రసాద్ అన్నారు. శాలిగౌరారం లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎస్ఎల్ఎన్ స్వామి షాపింగ్ మాల్ సహకారం తో మండల స్థాయిలో జరిగిన ముగ్గుల పోటీలు నిర్వ హించారు. ముఖ్య అతిధి గా కేవీ ప్రసాద్ పాల్గొని మహిళా విజేతల కు చీరలు అందజేశారు. ఈ సం దర్బంగా అయన మాట్లాడుతూ మహిళలు కు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్ లను అందజేసిఉపాధి కలిపి పిస్తున్నా మన్నారు.ప్రతి సంవత్సరం బతు కమ్మ, సంక్రాంతి పండుగలకు పోటీ లు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామన్నారు.
ప్రపంచం లోనే 220 దేశాల్లో లయన్స్ క్లబ్ ద్వారా కోట్లాది మంది కి సేవలు అందిస్తూమన్నారు. శాలిగౌరారం లయన్స్ క్లబ్ సేవలు అందిచడం లో అగ్రగ్రామికి ఉందన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోడే సతీష్,ఎస్ఎల్ ఎన్ స్వామి షాపింగ్ మాల్ ఎండీ గట్టు శ్యామ్ సుందర్,పాస్ట్ జోన్ ఛైర్మెన్ యర్ర శంబు లింగా రెడ్డి, చైత్ర ఫాండేషన్ ఛైర్మెన్ యంగలి రామకృష్ణ గౌడ్, చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, కార్యదర్శి మారోజు వెంకటాచారి, కోశాధికారి వడ్లకొండ బిక్షం, సభ్యులు దునక వెంకన్న, దామెర్ల శ్రీనివాస్, గుండ్ల రామ్మూర్తి, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.