–ఆదివాసి కుగ్రామాల్లోని నడకదా రుల్లో అరిగోస
–ప్రధానంగా గర్భిణీ స్త్రీల విషయం లో దారులన్నీ ప్రమాద భరితం
–గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లేందుకు నానాయాతన పడుతున్న వైనం
–అదిలాబాద్ జిల్లాలో ని ఆదివాసి గ్రామాల్లో బాధలు వర్ణనాతీతం
pregnant women: ప్రజాదీవెన, ఆదిలాబాద్: ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న వేళ అడవుల (forests) జిల్లాలోని ఆదివాసీ కుగ్రామాలు మాత్రం ఇంకా నరకకూపాలుగా మారుతున్నాయి. వర్ష కాలం (rainy season) వచ్చిదంటే చాలు పొంగిపొర్లుతున్న వాగులు, అడుగు తీసి అడుగు వేయాలేని దారులు.. అంబులెన్స్ (Ambulance) రాని రహదారులు.. అక్కడి తల్లుల పాలిట మృత్యు దారులవుతున్నాయి. రహదారి మార్గాలు లేక అంబులెన్స్‌లు రాక ఎడ్ల బండ్లే ఏర్ అంబులెన్స్‌లు (Ambulance)అవుతున్నాయి. పురిటి నొప్పులతో నరకం చూస్తున్న గర్బిణిలను సమయానికి ఆస్పత్రులకు చేర్చే దారి లేక ప్రసవ వేదనను అంతంతకు పెరిగిపోతోంది. అదృష్టం ఉంటే నడి రోడ్డుపై ప్రసవం లేదంటే తల్లి బిడ్డా మరణం.. ఇది అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మారుమూల గ్రామాలలో వర్ష కాలం నిత్యం కనిపించే దృశ్యాలు. వాగులు దాటి సమయానికి ఆస్పత్రికి చేరితే సరి.. లేదంటే తల్లి బిడ్డా ప్రాణాలు ఆ వాగు ఒడ్డునే గాల్లో కలవాల్సిన దుస్థితి. గర్భిణీల (pregnant women)పాలిట శాపంగా మారుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నరకదారులు.
అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఏజేన్సీ గ్రామాలు (Agency villages) నడక దారి కష్టాలతో నరక యాతన అనుభవిస్తున్నాయి. పొంగుతున్న వాగులతో నిలిచిపోతున్న రాకపోకల కారణంగా గర్భిణీలు, బాలింతలు మృత్యువుతో పోరాటం చేయాల్సిన దుస్థితిని కలిపిస్తున్నాయి. స్వాతంత్ర్య వచ్చి 7 దశాబ్దాలు దాటి, తెలంగాణ రాష్ట్రం (Telangana State) వచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. ప్రభుత్వాలు మారినా పాలకులు మారుతున్న ఆదిలాబాద్ ఆదివాసీ గూడాల దుస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్ లో చోటు చేసుకున్న ఘటనే అందుకు సాక్ష్యం.
గత ఏడాది కురిసిన వర్షాలకి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కోతకు గురైంది. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే రాకపోకలకు కష్టంగా మారింది. తాజాగా కురిసిన వర్షానికి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన గిరిజన గర్భిణి వనితకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబం సిద్దమైంది. గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో భర్త గంగాధర్, ఆశా కార్యకర్త కళాబాయి కుటుంబ సభ్యుల సాయంతో ఎడ్ల బండిపై ఆస్పత్రికి తరలించారు. గతుకుల రోడ్డు (roada)కావడంతో మూడు కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటన్నర సమయం పట్టింది. సిరిచెల్మకుదారికి చేరుకోగానే స్థానికుల సాయంతో గర్భిణీ జీపులో ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. తీరా ఇచ్చోడ ఆస్పత్రికి తరలించాక.. నెలలు నిండలేదని వనితను వైద్య సిబ్బంది రిమ్స్ కు రెఫర్ చేశారు. ఒక్క వనితనే కాదు ఆదిలాబాద్ లోని 300 కు పైగా ఆదివాసీ మారుమూల గ్రామాల్లోని గర్భిణుల (pregnant women) పరిస్థితి ఇదే..!