Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులకు సిద్ధం

పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించటం తెలిసిందే. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణయ్యే వారిని గుర్తించేందుకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రత్యేక కిట్‌ను ఏర్పాటు చేసిన అధికారులు
మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం

ప్రజాదీవెన, హైదరాబాద్: పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించటం తెలిసిందే. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణయ్యే వారిని గుర్తించేందుకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే తరహాలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. కొత్తగా ‘డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌’ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర (Anti Narcotics Bureau) యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌) ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ కిట్‌ను రూపొందించింది.

డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ‘ఎబోన్‌ యూరిన్‌ కప్‌’ యంత్రంతో అప్పటికప్పుడు టెస్టులు నిర్వహించనుంది. ఈ ప్రత్యేక కిట్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. సదరు పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో టెస్టులు మొదలుపెట్టారు. డోర్నకల్ రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ పరిసరాల్లో అనుమానంగా తిరుగుతున్న యువకులకు స్థానిక పోలీసులు పరీక్షలు నిర్వహించారు.

గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన పక్షంలో ఈ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు కన్పిస్తే ‘నెగెటివ్‌’గా, ఒకటే గీత కన్పిస్తే ‘పాజిటివ్‌’గా పరిగణిస్తారు. పాజిటివ్‌గా తేలితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. అవసరమైతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారినే టార్గెట్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Prepare for drug and drive tests