Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Principal M Ramana Reddy: చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే

Principal M Ramana Reddy: ప్రజా దీవెన, కోదాడ: దేశములో మహిళలకు విద్యను అందించిన మొట్టమొదటి చదువు నేర్పిన సరస్వతి సావిత్రిబాయి పూలే అని కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణారెడ్డి అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం, విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే అని గుర్తు చేశార.. కుల,మత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన చదువుల సరస్వతి సావిత్రిబాయి అని, విద్య ద్వారానే స్త్రీలకు జ్ఞానం, సామాజిక స్పృహ కలుగుతుందని, అందుకే స్త్రీలందరూ చదువుకోవాలని పిలుపునిచ్చి, తానే స్వయంగా పాఠాలు చెబుతూ, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయింది ఉన్నారు కుల వ్యవస్థకు, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం పోరాడడం తన సామాజిక బాధ్యత అని నమ్మి,తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిందన్నారు.

తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి, స్త్రీలలో చదువు పట్ల ఆకాంక్షను రగుల్కొల్పింది. ఆవిడ ధైర్యాన్ని ప్రతి బాలిక కలిగి ఉండాలని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర పఠనం అవసరమని అన్నారు. క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తెలుగు లెక్చరర్ వేముల వెంకన్న సమన్వయకర్తగా వ్యవహరించినఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్.పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు,జి.యాదగిరి,వి. బల భీమారావు, జి.నాగరాజు, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, పి.తిరుమల,యస్.గోపికృష్ణ, ఎం .చంద్రశేఖర్, ఇ.నరసింహారెడ్డి,యస్. కె.ముస్తఫా, ఇ .సైదులు,యస్.కె.ఆరీఫ్,యన్.రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్,యస్.వెంకటాచారి,జ్యోతి, డి.ఎస్ .రావులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.