–శిక్ష పూర్తయ్యలోపు తీర్చి దిద్దేందుకు కృషి
— ఖైదీల వార్షిక క్రీడలు 2025 ము గింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
Prisoner Reform in Telangana : ప్రజా దీవెన, హైదరాబాద్ : శిక్ష పూర్తయ్యేలోపు ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి వారిని బాధ్యతాయుత మైన పౌరులుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆది వారం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్ల పల్లి సెంట్రల్ జైల్లో నిర్వహించిన “ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025 ముగింపు వేడు కలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా తెలంగాణ జైళ్ల శాఖ అమ లు చేస్తున్న సంస్కరణలు ఇతర రా ష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచా యని ఈ సందర్భంగా మంత్రి వివ రించారు. తెలిసో తెలియకో చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొం దించేందుకు అనేక చేతి వృత్తులు, ఇతర పనుల్లో నైపుణ్య శిక్షణ అం దిస్తున్నామన్నారు. ఖైదీలు మాన సిక ఒత్తిడికి గురి కాకుండా నిపుణు లతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పి స్తున్నామన్నారు.
ఖైదీలు తయారు చేసే ఉత్పత్తు లకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా వారిని మరింత ప్రోత్సహిస్తా మన్నారు. జైలుకు కావాలని ఎవ రూ రారని, బయటకు వెళ్లిన తర్వా త మరోసారి అలాంటి తప్పు చేయ కుండా గౌరవంగా జీవించాలని ఖైదీ లకు సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు ప్రభుత్వం తరఫు న వీలైనంత వరకు అండగా ఉంటా మన్నారు. శిక్ష అనుభవించే సమ యంలో ఆందోళనకు గురి కావొద్ద ని, అలాగే కాలాన్ని వృథా చేయ కుండా ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సూచించారు. ఒకవేళ ఉన్నత విద్యను అభ్య సించాలను కుంటే నిబంధనల ప్రకారం జైళ్ల శా ఖ తరఫున సహకరిస్త మన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేం దర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, పలువురు ఉన్నతాధికారు లు పాల్గొన్నారు.