Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Problems of hostel students should be solved వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం -- బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

 

రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం

— బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

ప్రజా దీవెన/నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన మెస్ చార్జీలు స్వాగతిస్తున్నామని , వసతి గృహ విద్యార్థుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ కోరారు. విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఖాళీ అయిన వార్డెన్ పోస్ట్ లనే తక్షణమే భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్ధులకు నోటు పుస్తకాలు, యూని ఫామ్ బెడ్ షీట్ , ఇవ్వకుంటే విద్యార్ధులు ఎలా చదువుకుంటారనుకుంటారని ప్రశ్నించారు. విద్యార్ధులకు కొత్త మెనూ ప్రకారం ఆహారాన్ని అందించవలసిన వార్డెన్లు పాత మెనూనే పాటిస్తునారని ఆరోపించారు.

వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యా ర్ధుల సంఖ్య తగ్గట్టు బాత్రూమ్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు త్రాగునీరు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, స్థానిక ఎం.ఎల్.ఎ సంక్షేమ వసతి గృహాలు అన్నింటిని సందర్శించి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని విద్యార్ధుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్ ,శేఖర్ యాదవ్, సతీష్ ,రాములు ,మహేష్ , రవి ,రమేష్ ,శంకర్ ,మల్లికార్జున్ ,యాదగిరి ,మల్లేష్ ,లక్ష్మణ్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.