Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Professor Kasim: సంక్షోభంలో ఉన్న సమాజానికి కదలిక రావాలి

*ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలే సమాజంలో మార్పు తెచ్చాయి
* 1974లో చారిత్రాత్మక అవసరంగాతొలిసంధ్యలోపిడిఎస్యు ఆర్భవించింది
*ఆధునిక సమాజంలో విప్లవాలకు నాంది ఫ్రెంచ్ విప్లవం
*పిడిఎస్యు విద్యార్థులు విప్లవ సమాజానికి పునాదులు… ప్రొఫెసర్ ఖాసీం

Professor Kasim: ప్రజా దీవెన, కోదాడ:సంక్షోభంలో ఉన్న సమాజంలో కదలిక తెచ్చే ప్రధాన భూమిక బుద్ధి జీవుల పైనే ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం (Professor Kasim) అన్నారు. ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (Student Union) అర్థ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కె ఆర్ ఆర్ పి డి ఎస్ యు పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సమాజంలో విప్లవాలకు ఫ్రెంచ్ విప్లవం నాంది పలికింది అన్నారు విద్యార్థులు ప్రపంచ చరిత్రలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు జర్మనీలో మధ్యతరగతిలో పుట్టిన మావో భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలపై పోరాడేందుకు వెయ్యి ఏండ్ల ప్రపంచ చరిత్రను స్థూలంగా వందేళ్ళ ప్రపంచ చరిత్రను సూక్ష్మంగా విద్యార్థులు అధ్యయనం చేయాలని చెప్పారు కమ్యూనిస్టు మేనిఫెస్టోకు ఆద్యం పోసిన దాస్ క్యాపిటల్ గ్రంధ రచయిత కార్లు మార్క్స్ తన విప్లవ భావజాలాన్ని సమాజాన్ని అందించేందుకు జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.

కదిలేందుకు కాళ్లు లేకపోయినా సంక్షోభంలో ఉన్న సమాజానికి సంభాషణగా మారిన ప్రొఫెసర్ సాయిబాబా పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టించారు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే హామీలు నాణ్యమైన విద్య ఉద్యోగం (Education is a job) అమలు చేయకుండా సమాజాన్ని సంక్షోభంలో పడేసినప్పుడు సాయిబాబా నేను చావును నిరాకరిస్తున్నాను అని రాసిన కవిత నినాదం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేటి ప్రధాని మోడీలను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు మధ్య భారత దేశంలో ఆదివాసి కాళ్ళ కింద ఉన్న కనీసం సంపదను భారత సమాజానికి దక్కకుండా పాశ్చాత్య దేశాలకు తరలిస్తున్న పాలకవర్గాలపై సాయిబాబా పోరాటం చిరస్మరణీయంగా ఉంటుందన్నారు సాయిబాబా భౌతికంగా లేకపోయినా ఆయన భావజాలం సమాజంలో బతికే ఉందన్నారు రష్యాలో సంక్షోభ సమయంలో కారల్ మార్క్స్ సిద్ధాంతాలు పోరాట భావజాలం కార్మిక వర్గానికి స్వర్గాన్ని చూపించిందన్నారు.

బానిసత్వం (Slavery) నిరంకుశత్వం ఆయుధాలుగా ప్రజలను పీడిస్తున్న జార్ చక్రవర్తులపై లేనిన్ స్టాలిన్ చేసిన పోరాటాన్ని వివరించారు. ఎంత గొప్ప సిద్ధాంతమైనా ఆచరణకు నిలబడ్డప్పుడే ఫలితాన్ని ఇస్తుందన్నారు హిట్లర్ ముసోనిలా నియంతృత్వాన్ని నాటి సామ్యవాదులు బుద్ధి జీవులుగా ఎదుర్కొన్నారన్నారు సామ్యవాదం అంటే సినిమా కాదు సామ్యవాదం అంటే నిజం సినిమా అన్నారు తెల్ల ధరలు పోయి నల్ల ధరలు వస్తే స్వతంత్రం వచ్చినట్టు కాదని భగత్ సింగ్ అన్న మాటలు గుర్తు చేశారు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుల పోరాట స్ఫూర్తిని చెప్పారు. పాలకవర్గాలు మాదకద్రవ్యాలతో సెల్ ఫోన్లతో పాశ్చాత్య సంస్కృతితో యువతను బానిసలుగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు 1974లో చారిత్రాత్మక అవసరంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆవిర్భవించింది అన్నారు కమ్యూనిస్టులు ఆంధ్ర జన సంఘం లేకపోతే ఆంధ్ర మహాసభ లేదన్నారు వారి ఉద్యమాల్ని పల్లెటూర్లలో ప్రజలను చైతన్య పరిచయాన్ని చెప్పారు పిడిఎస్యులో ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించి విద్యార్థి విప్లవాలకు అరుణ తారగా నిలిచిన కామ్రేడ్ జార్జి రెడ్డి (George Reddy) ఆశయాలను సాధించాలన్నారు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి కాదని సమాజం మొత్తం విద్యార్థితో ముడిపడి ఉంటుందన్నారు శ్రీ శ్రీ చరబండ రాజు విప్లవ గేయాలను స్మరించారు నూతన మానవ పరిణామ క్రమం జరగాలంటే కాగే నెత్తుటితోనే సాధ్యమవుతుందన్నారు.

కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల (KRR Degree College) ప్రగతిశీల ప్రజాస్వామ్య భావజాలానికి పురుడు పోసిందన్నారు. నాటి పూర్వ విద్యార్థులు రాయపూడి చిన్ని, కరెంటు రామిరెడ్డి గౌరీ శంకర్ (Ramireddy Gauri Shankar) తో పాటు ఎంతోమంది విద్యార్థుల విప్లవ పోరాటాలను నేటి తరం ప్రగతిశీల విద్యార్థి సంఘం ముందుకు తీసుకెళ్లాలి అన్నారు మరో వక్త కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ నాటిపిడిఎస్ విద్యార్థి సంఘం గోడల మీద రాతలే జ్ఞాన నాడులుగా పనిచేసే అన్నారు నాడు కే ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో గతించిన కాలం నడిపించే కాలానికి బాట వేసిందన్నారు ప్రగతిశీల భావజాలంతో కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులుగా గ్రామాల్లో వెళ్లి ప్రజలను చైతన్యపరిచామన్నారు కేఆర్ డిగ్రీ కళాశాల పిడిఎస్యు విద్యార్థి సంఘం పోరాటమే తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రధాన భూమిక వహించిందన్నారు ఆ భావజాలమే ఆర్ట్స్ కాలేజీ నుండి దండకారణ్యానికి బాటలు వేసిందన్నారు. పి డి ఎస్ యు అర్థ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు.

ఈ సందర్భంగా పీడీ ఎస్యూ విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన పూర్వ విద్యార్థులకు నివాళులర్పించారు కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల పీడియస్ యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు పూర్వ విద్యార్థి రాయపూడి చిన్ని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వల్లూరి రామిరెడ్డి, కే బాబురావు కాకి భాస్కర్ ,ధర్మార్జున్ పందిరి నాగిరెడ్డి గంధం బంగారు, వక్కవంతుల నాగార్జున, ముతవరపు పాండురంగారావు, పార సీతయ్య వేములవెంకటేశ్వర్లు,రాజేష్ ,పెదనాటి వెంకటేశ్వరరావు స్వామి, వెంకట్, ఉప్పుల యుగంధర్ రెడ్డి, ముప్పాని కృష్ణారెడ్డి ,రామ నరసయ్య, హరికిషన్, రాఘవరెడ్డి ,బద్దం భద్రారెడ్డి, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింహాద్రి, చందర్రావు ,పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు