Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahul Gandhi: ఎన్డీఏ, ఇండియా మధ్య రాజ్యాంగ రక్షణకు యుద్ధం

లోక్‌సభ ఎన్నికలు భిన్నధృవ సిద్ధాంతాలున్న రెండు సమూహాల మధ్య జరుగు తున్న యుద్ధమని, ఓవైపు రాజ్యాం గాన్ని రక్షించేందుకు ఇండియా’l కూటమి ఇంకోవైపు రాజ్యాంగాన్ని మార్చే ప్రణాళికలో ఉన్న ఎన్డీయే కూటమి నిలబడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

రాజ్యాంగం రద్దు కుట్ర ఎన్డీయేది, కాపాడుకునే బాధ్యత ఇండియాది
తెలంగాణలోని పేదింటి మహిళ ఖాతాలో మా తరపున రూ.లక్ష, రాష్ట్రమిచ్చేది రూ.30వేలు
రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పి స్తాం
దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సం స్థనూ సర్వేచేస్తాం, ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది
రిజర్వేషన్లపై పరిమితినీ ఎత్తేస్తాం యాభై శాతానికి మించి పెంచుతాం
మోదీ సర్కారు నింపిన విద్వేషాల వీధుల్లో ప్రేమను పంచుతున్నాం
నిర్మల్‌, అలంపూర్‌ కాంగ్రెస్‌ జనజాతర సభల్లో రాహుల్‌ గాంధీ

ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) భిన్నధృవ సిద్ధాంతాలున్న రెండు సమూహాల మధ్య జరుగు తున్న యుద్ధమని, ఓవైపు రాజ్యాం గాన్ని రక్షించేందుకు ఇండియా’l కూటమి ఇంకోవైపు రాజ్యాంగాన్ని మార్చే ప్రణాళికలో ఉన్న ఎన్డీయే కూటమి నిలబడ్డాయని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)స్పష్టం చేశారు. దేశంలోని పేదలు, దళితు లు, ఆదివాసీలు, బలహీనవర్గాల కోసం అంబేడ్కర్‌, మహాత్మా గాoధీ, నెహ్రూ రూపొందించిన రాజ్యాంగా న్ని బీజేపీ(BJP) నలిపివేయాలని చూ స్తోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసేం బ్లీదుకు కుట్ర పన్నుతోందని వ్యా ఖ్యానించారు.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకం రిజ ర్వేషన్ల రద్దు అమల్లో భాగమేనని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామం టూ బీజేపీ(BJP) నేతలు సూటిగానే ప్రజలకు చెబుతున్నారని, రిజ ర్వేషన్లు తీసేయాలని బీజేపీలోని పెద్ద పెద్ద నాయకులు, సంఘ్‌ ము ఖ్య నాయకుడు తరచూ మాట్లా డుతున్నారని ఆరోపించారు.లోక్‌సభ ఎన్నిక ల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో, గద్వాల జిల్లా అలంపూర్‌లో(Alampur) జరిగిన జనజాతర సభల్లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుం చి ఓ మహిళను గుర్తించి ఏడాదికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో వేస్తా మని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

గత పదేళ్లలో మోదీ(Modi) ప్రభుత్వం దేశంలోని 22 బడా కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేసిందని, పేద ప్రజల ను ఏమాత్రం పట్టించు కోలేదని ‘ఇండియా’ కూటమి మాత్రం దేశ వ్యాప్తంగా కోట్లలో ఉన్న నిరుపేద లను లక్షాధికారులుగా మార్చేందు కు ప్రత్యేక పథకాన్ని రూపొందిం చిందని పేర్కొన్నారు. పేద కుటుం బాల్లో పురుషులతో పాటు మహిళ లూ పనులకు వెళతారని, అయితే మహిళలు ఇంటి పనుల కోసం 8 గంటల అదనంగా పని చేస్తారని, ఇందుకు వారికి ఎలాంటి చెల్లిం పులూ ఉండవన్నారు. సదరు వర్గాల శ్రమను గుర్తించి నెలకు రూ.8,500 చొప్పున ఖాతాల్లో టకాటక్‌ పడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు.

తెలం గాణ(Telangana) రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి నిరుపేద మహిళకు నెలకు రూ.2,5 00 చొప్పున చెల్లిం పు హామీని త్వర లోనే అమలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు తెలంగాణలోని ప్రతి పేద కుటుంబా నికి చెందిన మహిళకు రాష్ట్ర ప్రభు త్వం నుంచి రూ.30వే లు, కేంద్రం నుంచి రూ.లక్ష కలిపి రూ. 1.30 లక్షలు ఖాతాలో పడతా యని వివరించారు. ఈతాము అధికా రంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రైతుల రుణాలను ఎన్నడూ మాఫీ చేయని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కుటుంబాలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని, ఈ మొత్తo ఉపాధి హామీ పథకాన్ని 24 ఏళ్ల పాటు అమలు చేయడానికి అయ్యే నిధులతో సమానమని అన్నారు.

దేశ జనాభాలో వెనుకబడిన వర్గా లు 5o శాతం, దళితులు, మైనారిటీలు 15 చొప్పున, ఆదివాసీలు 8, అగ్రకుల పేదలు ఐదు నుంచి ఆరు శాతాల మేరకు ఉన్నారని మొత్తంగా 90 శాతానికి పైగా ఉన్న ఈ వర్గాల వారు దేశంలో పేరున్న ఏ సంస్థల్లోనూ కనిపించరని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చే శారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న 90 మంది బ్యూరో క్రాట్లలో ఓబీసీలు,(OBC) దళితులు ముగ్గు రు చొప్పున, ఆదివాసీల నుంచి ఒక రు మాత్రమే ఉన్నారని, పైగా వారికి ఇచ్చినవీ చిన్న చిన్న మంత్రిత్వ శాఖల్లోని పోస్టులేనని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే జన గణన, ఆర్థిక సర్వే చేస్తామని ప్రతి సంస్థనూ సర్వే చేస్తామని, ఫలి తంగా 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల వద్ద ఉన్న సంప ద ఎంత? కొద్ది మంది ధనవంతుల చేతుల్లో ఉన్న సంపద ఎంత అన్నది తేలిపోతుందన్నారు.

జన గణన, ఆర్థిక సర్వే తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని, క్రాంతికారీ రాజకీయాలు నడు స్తాయని చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, అగ్రకుల పేదలు 90 శాతానికి పైగా ఉన్నప్పుడు రిజ ర్వేషన్లు 50 శాతాన్ని మించ కూడదన్న నిబంధన అర్థరహితమ న్నారు. రిజర్వేషన్లపై ఉన్న పరిమితి ని ఎత్తివేసి 50శాతానికి మించి రిజ ర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేశా రు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తి వేస్తామంటూ ప్రధాని మోదీ ఇంత వరకు ఎక్కడా చెప్పలేదని, రిజర్వే షన్ల అమలుకు ఆయన వ్యతిరేక మని విమర్శించారు.

Protect Constitution war wetween NDA India