Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Public Governance Day: పట్టణంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

Public Governance Day: ప్రజా దీవెన, కోదాడ:ప్రజా పాలన దినోత్సవంను (Public Governance Day) పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని మంగళవారం ఘనంగా నిర్వహించారు స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు (Venepalli Srinivasa Rao)అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన తెలంగాణ గీతంను ఆలపించారు. అలాగే కోదాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్పర్సన్ సామినేని ప్రమీల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపం చేశారు మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ నందు గల కెఆర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ చందా అప్పారావు జాతీయ జెండా నా ఆవిష్కరించి జాతీయ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల విశ్రాంతి ప్రిన్సిపల్ అన్య సత్యం పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రసంగించారు అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులు నారాయణరావును (Warriors Narayana Rao) ఘనంగా సత్కరించారు అలాగే కోదాడ పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలు చేశారు అనంతరం వక్తులు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ ప్రజలకు విముక్తి కలిగింది కానీ తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలగలేదు అన్నారు.మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం స్వాతంత్ర భారతదేశంలో విలీనమైన ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) చిత్రపటానికిపూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లు రాంబాబు, ఆర్థిక కార్యదర్శి అమృత రెడ్డి, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ రావు కళాశాల అధ్యాపకులు ఫ్రాన్సిస్ సైదిరెడ్డి సైదులు నిర్మల కుమారి సత్యవాణి పీవీ రెడ్డి సైదమ్మ ఏ కళాశాల నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థులు మున్సిపల్ కమిషనర్ రమాదేవి వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.