Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sita rama project: ఎనిమిది వేల కోట్ల ఖర్చుతో ఎకరంకైనా నీరివ్వలే

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై మం త్రుల విమర్శలు
సీతారామ పేరిట రీ డిజైన్ తో ప్రజాధనం దుర్వినియోగం
ఆగస్టు 15 నాటికి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లిస్తాం
ఎన్కూర్ లింకు కెనాన్  కు రాజీవ్ కెనాల్ గా నామకరణం
ఆరు గంటల పాటు సీతారామ ప్రాజెక్టు పనుల పరిశీలన
సహచర మంత్రులతో కలిసి సీతా రామ ప్రాజెక్టుపై(Sita rama project) సమీక్షించిన డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, ఖమ్మం: ఆగస్టు 15వ తేదీ నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎక రాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు తెలిపారు. గురు వారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Irrigation Minister Uttamkumar Reddy), రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Revenue Minister Ponguleti Srinivas Reddy), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మం డలం అమ్మగారి పల్లి వద్ద ఉన్న సీతారామ(Sita rama project) హెడ్ రెగ్యులేటరీ పను లను, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబి షన్ను తిలకించారు.

అక్కడి నుంచి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్- 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లై ను ప్రారంభిం చారు. ఆ తర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్ప టివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్  పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావ డానికి కావలసిన నిధులు, ఎదుర వుతున్న సమస్యలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరి గేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. అనం తరం డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మాట్లాడుతూ కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతా రామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు  పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసిందని విమర్శించారు.

దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజె క్టుపై ఎనిమిది వేల కోట్ల రూపా యలను ఖర్చు పెట్టిన గత ప్రభు త్వం ఒక్క ఎకరానికి కూడా తాగు నీరు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వ అధి కారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయ డానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు.  సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయ డానికి సమీక్షంచమన్నారు. సీతా రామ ప్రాజెక్టు కు ఎన్ఎస్పిఎల్ కెనాల్ కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరి చేశా మన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చా మన్నారు. పంప్స్ ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ(Sita rama lift irrigation) లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు

ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిన కేసీఆర్: మంత్రి ఉత్తమ్

ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్ను గత ముఖ్యమం త్రి కేసీఆర్ రాష్ట్రం కోలుకోలేని విధం గా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు 90 4000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిం దని వివరించారు పాలమూరు రం గారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి  గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎ కరం కూడా కొత్త ఆయకట్టు తీసు కురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలే దన్నారు. గత బిహారీ సర్కార్ మొద లుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేని అసమర్ధత ప్రభుత్వమని విమర్శించారు.

కొత్తగూడెం పినపా క భద్రాచలం నియోజకవర్గం హామీ ఇచ్చారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికను తయారు చేసు కొని ముందుకు పోతున్నదని వివ రించారు. 2000 కోట్లతో పూర్తయి రాజీవ్ సాగర్ ను(Rajiv sagar) సరైన కారణం లేకుండా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్థం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గోదావరి నది జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయ డమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు.

రీడిజన్ పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి హార్దిక భారం మోపినప్పటికీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖలో ఉన్న స్త్రీలను తొలగించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్(sitarama lift irrigation canal) మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Public money wasted redesign of Sita rama project