Public Problems : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మార్చి 28న జిల్లా కలెక్టరేట్ ముం దు జరుగు ధర్నా లో పట్టణ ప్రజ లు అధిక సంఖ్యలో హాజరై జయప్ర దం చేయాలని సిపిఎం జిల్లా కమి టీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కా ర్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలు పునిచ్చారు. మంగళవారం సుంద రయ్య భవన్ లో జరిగిన విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమే రకు మార్చి నెలలో ప్రజా సమస్య లపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలో మార్చి ఒకటి నుండి పది వరకు పలు బృందాలుగా పట్టణ వ్యాప్తంగా వివిధ ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన ప్రధాన సమస్యలు పట్టణ అభివృద్ధి ప్రణాళికా ప్రకారం జరగకుండా ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యంగా అభివృద్ధి జరిగిన ప్రాంతాలపై మరింత నిధులు కేటాయించడం విలీన శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అభివృద్ధికి దూరంగా వేయడం జరిగిందని అన్నారు. విలీన ప్రాంతాల్లో వార్డు కార్యాలయానికి వెళ్లడం కూడా రోడ్లు లేని దుస్థితి ఉందన్నారు. పానగల్లు పెద్ద బండ విలీన ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో పడిన గుంతలు వెంటనే పూడ్చి సిసి రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు కతాల గూడెం పానగల్లు పెద్ద బండ చర్లపల్లి ఎస్టి కాలనీ శేషమ్మ గూడెం తదితర స్మశాన వాటికల లో మౌలిక వసతులు కల్పించకుండా వదిలి వేయడంతో ఆక్రమణలకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుల పాఠశాల ,ఆర్టీసీ కాలనీ, బొట్టుగూడా లలో ఉన్న స్ట్రామ్ వాటర్ పెద్ద డ్రైనేజీలపై స్లాబులు వేసి వరదనీరు రోడ్లపైకి రాకుండా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక జీవనోపాధి కోసం పట్టణాలకు వలసలు వచ్చి అద్దె ఇండ్లలో జీవిస్తూ సొంతింటి కల కోసం వేలాదిమంది ప్రభుత్వాలకు దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు లాటరీ ద్వారా ఎంపికైన వారికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చేసిన వాగ్దానం వెంటనే అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు అర్హత కలిగిన ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు అమలవుతున్న ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి పట్టణ పేదలకు ఉపాధి అవకాశా లు కల్పించాలని డిమాండ్ చేశా రు. 2018 సంవత్సరం నుండి ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వితంతువులు, వికలాంగులు వృ ద్ధులు , ఒంటరి మహిళలు వృత్తి దారులు పట్టణంలో దాదాపు 25 00 మంది ఉన్నారని వారికి ఆసరా పెన్షన్ అందకపోవడంతో కుటుం బాలు గడపడం ఇబ్బందిగా ఉన్న దని అర్హత కలిగి దరఖాస్తు చేసు కున్న వారందరికీ వెంటనే పెన్షన్లు మం జూరు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ విలేకర్ల సమావేశంలో సిపి ఎం పట్టణ కమిటీ సభ్యులు తు మ్మల పద్మ, గాదె నరసింహ, భూ తం అరుణ, మాజీ కౌన్సిలర్ అవు ట రవీందర్ తదితరులు పాల్గొ న్నారు.