Puli Sarvotham Reddy :ప్రజా దీవెన, నల్గొండ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ ,వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలు తెప్పించి జిహెచ్ఎం ఆ పై స్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాధికారి డైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఉన్నత ప్రమోషన్లు,అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ వచ్చేలా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తెప్పించేలా తపస్ ప్రయత్నం చేస్తుంది అని అన్నారు.
గత ఎన్నికల్లో సిపిఎస్ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు శూన్యమని అన్నారు సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు జాతీయవాద భావప్రియ సంఘం అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీల నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫలమైందని ఉపాధ్యాయులకు రావాల్సిన జిపిఎఫ్,పెండింగ్ బిల్స్, డి ఏ లు పిఆర్సి పెండింగ్ బిల్స్ విషయంలో ప్రభుత్వం తాత్సరం చేయడం పెట్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఓడీలను అనుభవిస్తూ ఉపాధ్యాయ సంక్షేమాన్ని విస్మరించినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ సమావేశంలో TPUS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇరుగు శ్రీరామ్,బత్తిని భాస్కర్ గౌడ్ ,రాష్ట్ర సహాధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి,రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య,జిల్లా నాయకులు కట్టేబోయిన శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి , నర్సిరెడ్డి ,చనగోని యాదయ్య ,వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా బాధ్యులు TPUS శ్రేణులు పాల్గొన్నారు..