Quiz Competition : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(అటానమస్)కు చెందిన చరిత్ర విభాగం నుండి త్వరలో జరిగే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు “నలగొండ పట్టణంలో చారిత్రక ప్రదేశాలు “అనే అంశం పైన ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక చరిత్ర విభాగం సబ్జెక్టు కావడంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ చరిత్ర విభాగం బోధన సిబ్బందిని మరియు ప్రాజెక్టుల పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పరిశోధన పరిణితిని పెంచుకోవాలని భవిష్యత్తులో చేయబోయే పరిశోధనలకు డిగ్రీ కళాశాలలోనే పునాది ఏర్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్ డాక్టర్ మునిస్వామి ,చరిత్ర ఉపన్యాసకులు డాక్టర్ భట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య , ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.