Quiz Competition : ప్రజా దీవేన, కోదాడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో కేఆర్ఆర్ కళాశాల కోదాడలో అర్థశాస్త్ర విభాగం కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 కళాశాల విద్యార్థులతో పోటీలో పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను యేలికి తీయడానికి ఇలాంటి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయి, ఈ పోటీల్లో అర్థశాస్త్ర విభాగంలో Ch. అనిల్, T. విజయ్ కుమార్, V. చైతన్య, G. రాకేష్,J. వీరబాబు, విద్యార్థులు మరియు అధ్యాపకులు డాక్టర్ కే. సైదులు హైదరాబాదులోని ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో పాల్గొని ప్రశంస పత్రాలను అందుకోవడం జరిగింది.
వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హడ్సరాణి మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చందా అప్పారావు మరియు అధ్యాపకులు అభినందించారు