Quiz Competitions: ప్రజా దీవెన,కోదాడ: జాతీయ స్థాయిలో భారత నావికా దళం థింక్యూ 2024 పేరు మీద పాఠశాల స్థాయి విద్యార్థులకు దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో క్విజ్ (Quiz Competitions) నిర్వహించింది. ఈ క్విజ్ పోటీలలో దేశవ్యాప్తంగా 9000 పాఠశాలలు పాల్గొన్నాయి. మూడు దశల్లో రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల (Written test ,oral test)ద్వారా వడపోత పోసి ఉత్తర , దక్షిణ , తూర్పు, పడమర విభాగాలుగా నాలుగు ప్రాంతాల్లో నుంచి జాతీయ స్థాయిలో తుది పోటీలకు అత్యుత్తమంగా నిలిచిన (16) పాఠశాలల జట్లను ఎంపిక చేయడం జరిగింది.
తెలంగాణ నుంచి రెండు పాఠశాలలు ఎంపికయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయ మరియు హైదరాబాద్ లోని జాన్సన్ గ్రామర్ పాఠశాల ( మల్లాపూర్ ) కోదాడ తేజ విద్యాలయలో చదవుతున్న విద్యార్థులు నోముల సృజన్ గుప్త (9వ తరగతి ) , కొండ్ర నవీన్ కుమార్ (10వ తరగతి ) జట్టు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపల్ పుస్తెల రమాదేవి తెలియజేశారు. వీరికి తుది పోటీలు నవంబర్ 7 మరియు 8వ తేదిలలో కేరళ (Kerala)లోని ఎఝిమల భారతీయ నావికా శిక్షణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని క్విజ్ నిర్వాహకులు లేఖ పంపినట్లు ఆమె తెలిపారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీలకు (competitions)ఎంపికైన 16 పాఠశాలలకు చెందిన (32) మంది విద్యార్థులతో పాటు ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు మరియు ఒకరి తల్లి/ తండ్రికి ఈ క్విజ్ పోటీల వేదిక కు ఆహ్వనించారు. వీరికి విమాన ప్రయాణం , వసతి మరియు భోజన సౌకర్యాలవఎచి అన్ని ఏర్పాట్లను భారత నావికాదళం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నారు తేజ విద్యాలయ విద్యార్దులతో పాటు సాంఘిక శాస్త్ర అధ్యాపకులు ఉస్తేల ధనుష్ రెడ్డి (Dhanush Reddy) మరియు తల్లిదండ్రుల నుంచి నోముల వెంకటేశ్వర్లు వెళ్లడం జరుగుతుందని ప్రిన్సిపాల్ ఉస్తేల రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను తేజ విద్యాలయం యాజమాన్యం అభినందించారు