Race College students : ప్రజాదీవేన,కోదాడ: పట్టణములోని స్థానిక రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్రస్థాయిలో తమ సత్తా చాటారు. కళాశాలకు చెందిన వంగవేటి అక్షయ H .NO (2552107410) ఎంపీసీ ప్రథమ సంవత్సరం నందు 470 మార్కులకు గాను 468 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించింది. చిత్తార చరణ్ శ్రీ తేజ ,జీడిమెట్ల లేఖనా రెడ్డి, ముక్క చరణ్ సాయి గౌడ్ లు 467 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. రెడ్డిమల్ల భార్గవి 466, మారెడ్డి మణిదీప రెడ్డి 465, మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపిసి విభాగం నందు ఉప్పెల్లి అలేఖ్య 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించారు. షేక్ సుహానా 432 మార్కులు రాష్ట్రస్థాయిలో సాధించారు.
సీనియర్ ఎంపీసీ విభాగం నందు ఈగోటి సన్నీ 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ ర్యాంకు సాధించింది. జనగం తేజస్వి 991 కట్టమూరి కీర్తన 990 మార్కులు సాధించగా సీనియర్ బైపిసి విభాగంలో పారెల్లి వర్షిత 975 దేవారం కీర్తన రెడ్డి 974 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా రేస్ ఐఐటి మెడికల్ కళాశాల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయి మెయిన్స్ ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో అత్యంత ర్యాంకులు మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. రానున్న జేఈఈ అడ్వాన్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎంసెట్ ఎఫ్ సెట్ ఫలితాలలో విద్యార్థులు ముందంజలో ఉంటారని ఆమె తెలిపారు. అనంతరం కళాశాల యజమాన్యం కోదాడ పట్టణంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.