పది సంవత్సరాలు అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం బిఆర్ఎస్
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వా ధ్యేయం
-రాచకొండ లింగస్వామి ఐన్టీయుసి జిల్లా సహాయ కార్యదర్శి
Rachakonda Lingaswamy : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణపురం: గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పేదలకు ఎటువంటి లబ్ధి చేకూరేటటువంటి పథకాలు అమలు చేయకపోగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఐఎన్టియుసి యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ లింగస్వామి అన్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని డబుల్ బెడ్ రూమ్లు ఇస్తామని ఆశ చూపి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని రైతుబంధు పేరుతో గుట్టలకు రోడ్లకు లేఔట్లకు డబ్బులు పంచి.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేదలపై ప్రేమ ఉంటే పది సంవత్సరాలలో దళిత బంధు బీసీ బందు పథకాలను ఏ గ్రామసభల ద్వారా అమలు చేశారో చెప్పాలని గ్రామ సభలు నిర్వహించకుండా గత ప్రభుత్వంలో దళిత బంధు బీసీ బందు బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు లబ్ధి చేకూరే విధంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు దళితులకు మూడెకరాల భూమి అని దళితులను మోసం చేశారని మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సామాన్య నిరుపేదలను పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కొత్త పథకాన్ని కాంగ్రెస్ .
ప్రభుత్వం తీసుకొచ్చి భూమిలేని పేదలకు ఎంతో న్యాయం చేస్తుంటే తట్టుకోలేక పోతున్నారని ఇలాంటి ఆలోచన గత ప్రభుత్వానికి ఎందుకు రాలేదని వారు ప్రశ్నించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందకుండా అడ్డుకోవడం సరికాదని ఇప్పటికైనా వారి ధోరణి మారకపోతే ప్రజలె వారిపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది అని వారు అన్నారు.