ఉధృతమవుతోన్న గోదారమ్మ
ప్రజా దీవెన/ భద్రాచలం: ఉత్తరాన కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ కళకళలాడుతుంది. క్రమ క్రమంగా పెరుగుతూ
భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోన్న తీరు నిజమనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.భారీగా కురిసిన వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది..