Rahim Sharif : ప్రజా దీవెన,నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎండి రహీం షరీఫ్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల ప్రాథమిక పాఠశాలలో కేకు కట్ చేసి రమాబాయి చిత్రపటానికి నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయినీలకు శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు.
అనంతరం రహీం షరీఫ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వెన్నెముక గా నిలిచిన గొప్ప త్యాగశీలి రమాబాయి అని అన్నారు. సమాజంలోని మహిళలు రమాబాయి అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా హక్కులు లభించాయన్నారు. అంబేద్కర్ విజయం వెనుక రమాబాయి పాత్ర ఎంతో ఉందన్నారు. రమాబాయి గురించి ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం వున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆమె యొక్క జీవిత చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకరావాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ కైసర్,మైనారిటీ నాయకులు మహ్మద్ వాజిద్,విద్యార్థులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..