Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahul Gandhi Birthday Celebration : ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

Rahul Gandhi Birthday Celebration :  ప్రజా దీవెన, కోదాడ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు వంగవీటి. రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల.లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల.కోటేశ్వరరావు కౌన్సిలర్ల తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసరావు, గంధం. యాదగిరి, సైదా నాయక్, రహీం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీమ్,బాగ్దాద్, తిప్పని శ్రీను, కాజా గౌడ్, ముస్తఫా పాశం శ్రీను, సుధాకర్ నజీర్, సూర్యనారాయణ,భాజాన్, ముస్తఫా, ధావల్, రజనీకాంత్, జనార్ధాన్, తదితరులు పాల్గొన్నారు.