Railway Issues :ప్రజా దీవెన, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ అరు ణ్ కుమార్ జైన్ తో వరంగల్ పార్ల మెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తోటి ఎంపీ లతో కలిసి సమా వేశం అయ్యారు. వరంగల్ పార్ల మెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను పూర్తి చేయాల ని బుధవారం సికింద్రాబాద్ రైల్ ని లయంలో జీఎంకు వినతి పత్రం అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో కీలకమైన కాజీపేట జంక్ష న్ ప్రాముఖ్యతను ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చూడాలని వరంగల్ ఎం పీ డాక్టర్ కడియం కావ్య రైల్వే జీ ఎంను కోరారు. కాజీపేట లోకో ర న్నింగ్ డిపో సిబ్బందిని విజయవా డలోని లోకో రన్నింగ్ డిపో బదిలీ చేయడం, ప్రస్తుతం కాజీపేట లోకో రన్నింగ్ స్టేషన్ లో కొత్త పోస్టుల భర్తీ కి అధికారులు ఎలాంటి ప్రయత్నా లు చేయకపోవడం వంటి విషయా లపై రైల్వే జీఎం ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరణ కో రారు.
కాజీపేటలో 709 మంది ఉద్యోగుల సంఖ్యకు కేవలం 526 మంది ఉ ద్యోగులు మాత్రమే విధులు నిర్వ హిస్తున్నారని తెలియజేశారు. ప్ర స్తుతం కాజీపేట లోకో రన్నింగ్ స్టే షన్‌కు 184 కొత్త పోస్టింగ్‌లు మం జూరు చేసినప్పటికి, పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, దీని వల్ల ఉన్న ఉద్యోగులపై అధిక భారం పడు తుందని వరంగల్ ఎంపీ కడియం డా. కడియంకావ్య రైల్వే జిఎం కు వివరించారు.
ఇప్పుడు కీలకమైన కోచింగ్ క్రూ లిం క్‌లను రైల్వే అధికారులు బదిలీ చే యాలని నిర్ణయించుకున్నారని, జూలై 14, 2022న జరిగిన జాయిం ట్ కమిటీ సమావేశంలో రైల్వే అథా రిటీ ఇచ్చిన హామీని ఉల్లంఘించి, కృష్ణా, ఎల్‌టిటి, కోణార్క్ మరియు గౌతమి ఎక్స్‌ప్రెస్ లను కాజీపేట నుండి విజయవాడ డిపోకు తలు స్తున్నారని పేర్కొన్నారు. మంగళ వారం నుండి ఈ ఎక్స్ ప్రెస్ లింకుల ను విజయవాడ నుండి ఆపరేట్ చే స్తున్నట్లు అందుకు సంబంధించిన ఛార్జ్ తయారు చేశారని తెలిపారు. గతంలో ఈ లింకును కాజీపేట డి పో వారే అప్ అండ్ డౌన్ రూట్లో న డిపే వారిని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నాలుగు క్రూ లింకులను మార్చ కుండా యధావిధిగా కొనసాగించా లని రైల్వే జీఎంను ఎంపి కోరారు.
అమృత్ భారత్ పథకం కింద వరం గల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో జరు గుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేసి ప్రయాణికులకు అం దుబాటులోకి తీసుకురావాలని కో రారు. అంతేకాకుండా కాజీపేట బ స్టాండ్ ఏర్పాటుకు త్వరితగతిన ని ర్ణయం తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారులతో క లిసి స్థలం పరిశీలన చేసినట్లు వెల్ల డించారు. స్థల నిర్ణయం ప్రకటిస్తే వెంటనే బస్టాండ్ నిర్మాణం జరుగు తుందని పేర్కొన్నారు. ప్రస్తుత నిర్ణ యాలతో కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. రైల్వే యూనియన్ తో స మావేశం ఏర్పాటు చేసి వారి సమ స్యలను పరిష్కరించాలని ఎంపీ జిఎంను కోరారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య అభ్యర్థనల పట్ల రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు. వరంగల్ ఎంపీ కోరి నట్లు డివిజన్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కాజీపేట ప్రా ముఖ్యతను తగ్గకుండా రైల్వే సమ స్యలను పరిష్కరిస్తామని రైల్వే జీ ఎం తెలిపారని ఎంపీ వివరించారు. మూడు రోజుల్లో రైల్వే యూనియ న్ తో సమావేశమై వారి సమస్య లు పరిష్కరిస్తామని రైల్వే జీఎం తెలిపారని అన్నారు. ఈ స మా వేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య తో పాటు ఎంపీలు ర ఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమా ర్ రెడ్డి పాల్గొన్నారు.