–అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో వాహనం
–తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా ప్రవహిస్తున్న చిన్నాచితక వాగులు
Rains: ప్రజాదీవెన, కాటారం: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు (rains)కుమ్మేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా మారుతోంది. దీంతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో (AP, Telangana)వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో (Mulugu, Mahbubabad, Khammam, Bhadradri District)ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. మహాముత్తారం మండలం కేశవాపూర్- పెగడపల్లి అటవీ ప్రాంతంలోని వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం, మేడారం ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.. కాటారం మండలం గంగాపురి – మల్లారం గ్రామాల మధ్యలోని అలుగు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రాత్రి గుండ్రాత్‌పల్లి నుంచి దామరకుంటకు వెళ్తున్న బొలేరో వాహనం అలుగు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి డ్రైవర్‌ను (driver) సురక్షితంగా బయటకు తీశారు. బొలేరో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.