–నీటి వనరులపటిష్టత దిశగా కార్యచరణ
–మొదటి విడతగా122 చెరువు లు, 18 చెక్ డ్యాన్స్, 19 సబ్ సర్ఫే స్ డైక్స్ అభివృద్ధి
–నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల సస్యశ్యామలం కోసం ప్రణాళికలు
–తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి తో కలిసి నీటి వన రు ల అభివృద్ధి పై సమీక్ష నిర్వహించి న ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
Raj Gopal Reddy : ప్రజా దీవెన మునుగోడు: మును గో డు నియోజకవర్గాన్ని సస్యశ్యామ లం చేయడమే ధ్యేయంగా ముం దుకు వెళ్తున్నారు మునుగోడు శాస నసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపా ల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంప్ కార్యా లయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజ నీర్ శ్యాం ప్రసాద్ రెడ్డితో కలిసి ము నుగోడు నియోజకవర్గంలోని నీటి వనరుల అభివృద్ధి పై సమీక్ష నిర్వ హించారు. ఓ వైపు భారీ నీటిపారు దల ప్రాజెక్టులైన శివన్న గూడెం, కిష్రాంపల్లి రిజర్వాయర్లకు నీటిని తెచ్చే విషయంతో పాటు శివన్న గూడెం రిజర్వాయర్ నుండి నారా యణపూర్ చౌటుప్పల్ మండలాల కి నీటి తరలింపు పై చర్చించారు.
మరోవైపు చిన్న నీటి వనరుల అభివృద్ధి పరుస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. దీంట్లో భాగంగానే మును గోడు నియోజకవర్గంలో మొదటి విడతగా 122 చెరువులను, 18 చెక్ డాం లను, 19 సబ్ సర్ఫేస్ డైక్ లను అభివృద్ధి చేయడానికి కార్యా చరణ మొదలుపెట్టారు. ఈ 122 చెరువులలో 100 ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న 32 చెరువులు, 50 ఎకరాల నుండి 100 ఎకరాల మ ధ్య విస్తీర్ణం ఉన్న 46 చెరువులు, 50 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న 44 చెరువులను వచ్చే వానకాలం వర కు అభివృద్ధి చేయాలని నిర్ణయిం చారు. వీటితోపాటు గొలుసుకట్టు చెరువుల ఫీడర్ ఛానల్ లలో పూడిక తీయడం, కంపచెట్లను తొలగించడం లాంటి పనులను కూడా సమాంతరంగా చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. రా బోయే వానాకాలం సీజన్ వరకు ఈ పనులు పూర్తి చేసే విధంగా చూడాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు ఫోన్ చేశారు. ఒకవైపు చిన్న నీటి వనరులను ఒడిసిపడుతూనే మరోవైపు భారీ నీటిపారుదల ప్రా జెక్టులను త్వరితగతిన పూర్తి చే యడానికి తీసుకోవలసిన చర్య లపై తెలంగాణ రిటైర్డ్ శ్యాంప్రసాద్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు.