–అవగాహన లేమితో సమయానికి చికిత్స అందక కంటి సమస్యలు తలెత్తుతున్నాయి
–నియోజకవర్గ వ్యాప్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాలు
— ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు
Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికి ఉచి తం గా వైద్యం అందించి కను చూపు మెరుగయ్యేలా లక్ష్యంగా కోమటిరె డ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యం లో శంకర కంటి ఆసుపత్రి, ఫౌండే షన్ సౌజన్యంతో ఆదివారం ము నుగోడు పట్టణంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాల యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
మును గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి వైద్య శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ పీడత ని యోజకవర్గమని ఫ్లోరైడ్ తో పాటు కంటి సమస్యలు ఎక్కువని కంటి సమస్య వల్ల సొంత పని చేసుకోలే క ఇక్కడ ప్రజల కృంగిపోతున్నార ని అటువంటి వారికి ఉచితంగా వైద్యం అందించి ఉచితంగా ఆప రేషన్లు చేయించి కనుచూపు మెరు గయ్యేంతవరకు విడతల వారీగా డాక్టర్లతో సమీక్ష చేయించి మందు లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఏడు మండలాలు మున్సిపాలిటీలు కలుపుకొని ప్రతి నెల ఒక ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించేలా 9 నెలలు ప్రణాళికలు రూపొందించామని, ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబి రాలలో కంటి సమస్యలు ఉన్న వాళ్లు చూయించుకోవాలని నియో జకవర్గం ప్రజలను కోరారు. దాంట్లో భాగంగానే మునుగోడులో మొదటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహి స్తున్నామని 1000 నుండి 1200 మంది వరకు ఈ శిబిరంలో వైద్యం చేయించుకునేల ఏర్పాటు చేశామ న్నారు. సామాజిక సేవ చేస్తున్న శం కర కంటి ఆసుపత్రికి ఫీనిక్స్ ఫౌండే షన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.