Rajavardhan Reddy : ప్రజా దీవన, నారాయణపురం : హైదరాబాదులో అత్యున్నత న్యాయస్థానం,భారతదేశంలో అతిపెద్ద క్రిమినల్ కోర్టు నాంపల్లి కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆల్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి తో కలిసి లాయర్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ లాయర్స్ ఫోరం సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆల్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సమాచారాన్ని సేకరించి న్యాయవాదులకు సంబంధించిన క్యాలెండర్ ని రూపొందించి ప్రాక్టీస్ తో పాటు సామాజిక చైతన్యం కోసం విచ్చేస్తున్న న్యాయవాది మా సోదర సమానుడు నర్రి స్వామి అభినందనీయులు అన్నారు.లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి మాట్లాడుతూ.
న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు మొదలు పెట్టినప్పుడు నాంపల్లి కోర్టు నుంచి పొక్సో మొదలుకొని అనేక కేసుల్లో మంచి ఆర్డర్లను పొందిన కోర్టులో న్యాయవాదుల క్యాలండర్ నీ ఆవిష్కరించడం చాలా సంతోషకరం,రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థలో జడ్జిల నియమాకాలో, బార్ కౌన్సిల్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాలని మా లాయర్స్ ఫోరం కోరుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గోకుల్, రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, జాయింట్ సెక్రెటరీ రమేష్, సీనియర్ న్యాయవాదులు బి వెంకటేష్ కురుమ,లక్ష్మణ్ యాదవ్,గంప వెంకటేష్, అనేకమంది జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు