*విద్యార్థులు స్నేహ భావం తో ఒకరినొకరు సహకారం అందించుకోవాలి.
Rajesh Chaudhary:ప్రజా దీవెన ,కోదాడ: జూనియర్ కాలేజీలలో కొత్త చేరే జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు మార్గదర్శనం వహించి, వారితో స్నేహభావం తో మెలగాలని కోదాడ ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి (Rajesh Chaudhary) అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ జూనియర్ కాలేజీ (Junior College)లో గురువారం జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు వెల్కమ్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా కాలేజీ లో చేరే విద్యార్థుల్లో కాలేజీ పట్ల వున్న భయాందోళన లు తొలగించేందుకు, వారు కాలేజీ వాతావరణానికి అలవాటు పడేందుకు వెల్కమ్ పార్టీలు (Welcome parties) ఉపయోగపడతాయన్నారు.
సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కు విద్యా స్ఫూర్తిని అందించాలని, జూనియర్ విద్యార్థులు సీనియర్ల సలహాలు సద్వినియోగం చేసుకొని చదువులో(studies) రాణించాలని కోరారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు పరస్పరం సహకారం అందించుకొని కాలేజ్ కు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం కాలేజ్ కు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, వైస్ ప్రిన్సిపల్ జీ వీ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.