Rakshabandhan: ప్రజా దీవెన, శాలిగౌరారం: సోదరి సోదరులకు ప్రేమ, ఆప్యా యతలకు,అనుబంధానికి (For love, affection, attachment)ప్రతీకగా జరుపుకునే రక్షాబందన్ పండుగను సోమవారం శాలిగౌరారం మండలం లో ఘనంగా జరుపుకున్నారు. సోద రీమణులు సోదరులకు రాఖీలు కట్టి తమ ప్రేమ అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రతి ఇల్లు ఆడపడచుల రాకతో సందడిగా కనిపించింది. శాలిగౌరారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ (Denkala Satyanarayana) కు అయన ఇద్దరు సోదరీ లు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. మండలం కేంద్రం లో రాఖీ విక్రయ కేంద్రాలు, వస్త్ర దుకాణాలు స్వీట్ షాప్ లు సందడి గా కనిపించాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.