*దోషులను కఠినంగా శిక్షించాలి నూనే సులోచన.
Rally with candles: ప్రజా దీవెన, కోదాడ: కలకత్తాలో మహిళా డాక్టర్ (Female doctor)మేమిత పై జరిగిన దాడికి హత్యాచారానికి నిరసనగా కోదాడ మహిళా మండలి అధ్యక్షురాలు నూనె సులోచన ఆధ్వర్యంలో (Under the leadership of Nuni Sulochana)స్థానిక రామాలయం నుండి బస్టాండు ఎదురుగా గల గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె సులోచన మాట్లాడుతూ, డాక్టర్లు దేవుళ్ళతో సమానమని వైద్యో నారాయణ హరి అన్న పదాన్ని మరచి పోయి ఒక వైద్యురాలు పై సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేసి అత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఒక మహిళా డాక్టర్ ని (docter) చంపిన అంతకులకు సపోర్ట్ చేస్తున్న ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి వారం రోజులు అయినా ఇప్పటివరకు దోషుల్ని గుర్తించి అరెస్టు చేయడం గాని శిక్షించడం గాని జరగలేదని ఆవేదన (Anguish)వ్యక్తం చేశారు. ఇలాంటి మానవ మృగాలను నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు జరగడం వలన భవిష్యత్తులో డాక్టర్ చదవడానికి మహిళలు ఎవరు ముందుకు రారని అన్నారు. సంఘటనలు పునరావృతం అవ్వకుండా కేంద్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు ఏర్పరచి దోషులను ఉరి తీయాలి అన్నారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేదర లలిత, మాజీ కౌన్సిలర్ పాలూరి ఈశ్వరి ,రామ్ శెట్టి కృష్ణవేణి ,మాతంగి శైలజ, ఎం దేవి, గురు లక్ష్మి ,ప్రమీల , లక్ష్మి ,శెట్టి శిరీష, రామ్ శెట్టి ప్రమీల ,కోట గురులక్ష్మి, సుంకర సూర్య కళ ,ఖాజాబీ, కళావతి ,సంధ్య, అన్నపూర్ణ, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.