–రామ్ కోటి ప్రజాపతి
Ram Koti Prajapati : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టే 72 గంటల నిరవదిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రామ్ కోటి ప్రజాపతి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాచమల్ల బాలకృష్ణలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రులమని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డిలు బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. బీసీలంతా నల్లగొండ జిల్లాలో రెడ్డిలను గెలిపించుకున్నారని వారు ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ కోసం ప్రశ్నించాలని లేని పక్షంలో బీసీల చేతుల్లో భూస్థాపితం తప్పదని గుర్తు హెచ్చరించారు.అడుగున ఉన్న బీసీ బిల్లులు పార్లమెంట్ కు, అసెంబ్లీకి పంపి 9వ
షెడ్యూల్లో చేర్చిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోస పూరిత కుట్రలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపాలని చూస్తుందని అరపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు సాధనకై తెలంగాణ జాగృతి, యునైటెడ్ పులే ప్రంట్ ఆధ్వర్యంలో ఈనెల 4, 5,6,7 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద కల్వకుంట్ల కవితి చేపట్టనున్న నిరవదిక 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు వెలుగు శంకర్, దళిత సంఘం నాయకులు రాములు, యాదవ సంఘం నాయకులు దోటి గణేష్, పగిళ్ల భాస్కర్, శ్రీనివాస చారి, నగేష్, సంధ్యారాణి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.