Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ramarajyam: బిజెపి వచ్చాకే రామరాజ్యం వచ్చింది

: దేశంలో బిజెపి వచ్చాకే రామరాజ్యం నెలకొ ల్పామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు

బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో దోచు కుతిన్నారు
దేశానికి కాంగ్రెస్ ఒరగబెట్టింది యావత్ శూన్యం
అవినీతి, కుంభకోణాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ
బిజెపి అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో బిజెపి వచ్చాకే రామరాజ్యం నెలకొ ల్పామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajanath singh) అన్నారు. దక్షిణ భారతదేశా నికి తెలంగాణ ‘గేట్ వే’ అని పేర్కొ న్నారు. అవినీతి, కుంభకోణాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ పడుతున్నాయని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా శుక్రవా రం హాజరై ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ర్టంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిలో(Corruption) కూరు కుపోయిందని, రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని, ప్రజాధ నాన్ని సైతం లూటీ చేసిందని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినందుకు రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. దశాబ్దా లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చేసింది యావత్ శూన్యమని విమ ర్శించారు. మోడీ హయాంలో ఒక్క అవినీతి జరగలేదని, దేశం అభివృ ద్ధిలో రోల్ మోడల్ గా నిలిచిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నా రు. అభివృదికి కేరాఫ్ అడ్రస్ గా మోడీ పాలన గుర్తింపు తెచ్చుకు న్నదన్నారు.

శుక్రవారం సికింద్రాబా ద్ పార్లమెంటు అభ్యర్థి కిషన్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ మోడీ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం. భరోసా ఏర్పడిందని, అందువల్లనే ఆయన హయాం లో దేశం సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం నెలకొoదన్నారు. రాబో యే ఐదేండ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకనామీ కలిగిన దేశంగా తయార వుతుందన్నారు.(South india) దక్షిణ భారతదేశా నికి తెలంగాణ ‘గేట్ వే’ లాంటిదని. ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడి స్థిరమైన అభివృద్ధి జరిగితే ప్రజల కు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో అప్ప ట్లో బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్ద తు పలికిందని. కానీ పదేండ్ల పాటు పాలన “సాగించిన బీఆర్ఎస్ చివర కు ప్రజా ధనాన్ని లూటీ చేసింద న్నారు.

కాంగ్రెస్ రెండు ఒకటేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోతే మోడీ పాలన లో మాత్రం ఫైవ్ ట్రిలియన్ ఎకాన మీ దిశగా కే దేశం దూసుకుపోతు న్నదన్నారు. పేదరికం నుంచి 25 కోట్ల మంది ప్రజానీకం బైటపడ్డారని గుర్తుచేశారు. రక్షణ రంగంలో మన దేశం సొంత కాళ్ళపై నిలబడే స్థా యికి చేరుకుంటున్నదన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వే షన్ (Women reservation) సాధ్యమైందన్నారు. దీర్ఘకాలం గా ప్రజల సెంటిమెంట్గా, చిరకాల కోరికగా ఉన్న రామమందిరం సాకా రమైందని, జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిందని, ట్రిపుల్ తలాక్ కూడా రద్దు కావడంతో ముస్లిం సమాజ మహి ళలకు విముక్తి లభించిందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్(Etela rajendar)  తెలంగాణ ఆర్థిక మంత్రిగా మంచి పనితీరు కనబరి చారని, ఆయనను మల్కాజిగిరి అభ్యర్థిగా గెలిపించు కోవడం ఆ ప్రాంత ప్రజలకే ప్రయ జనం కలిగి స్తుందన్నారు. సికింద్రాబాద్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్రెడ్డిని కూడా గెలిపించుకోవడం అవసరమని, రానున్న రోజుల్లో ణ కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి సంపూర్ణ సహాయ సహకారాలు అందడానికి దోహదపడుతుం దన్నారు.

వినోద్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కృతజ్ఞతలు చెప్పడానికి మళ్లీ ఖమ్మం వస్తానని ఆయన మాటిచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రా బాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతానని నన్ను గెలిపిం చండని కోరారు. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబె డుతాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ప్రతిసారి పదవిలో ఉన్న ఐదేళ్ళు ఏం చేశానో ప్రజలకు నివేదిక ఇస్తున్నానని తెలి పారు. తెలంగాణ, సికింద్రాబాద్ అభివృద్ధి కోసం చేసిన పనులను ప్రజలు తెలియజేశానని అన్నారు. కేంద్ర మంత్రిగా నాకు మూడు శాఖలను అప్పజెప్పారు మోడీ (modi)అన్నారు. కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నానని తెలిపారు. 2004 నుంచి నాకు ఓటేసిన వారు తలదించుకునేలా చేయలేదన్నారు. నైతిక విలువల తో పని చేశానని అన్నారు.

Ram Rajyam came only when BJP came