ప్రజా దీవెన,కోదాడ:గ్రంధాలయాలు ప్రగతికి సోపానాలని అవి పుస్తక భాండాగారాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు శనివారం తేజ విద్యాలయ లో గ్రంథాలయాల ప్రాముఖ్యత మీద సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిలుగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ శ్రీ వంగవీటి రామారావు, పోతుగంటి నాగేశ్వరరావు ,నోముల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తేజ్ విద్యాలయ ప్రిన్సిపాల్ రమాదేవి , డైరెక్టర్ సోమిరెడ్డి అధ్యక్షత వహించారు.
విద్యార్థులను ఉద్దేశించి వంగవీటి రామారావు మాట్లాడుతూ “ గ్రంధాలయాలు ప్రగతికి సోపానాలని “గ్రంధాలయాలు పుస్తక భాండాగారాలని పేర్కొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయాల విశిష్టతను గురించి వక్తలు తెలియజేశారు. హైదరాబాదులో ప్రదర్శించిన పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న తేజ విద్యాలయ చిన్నారులను శ్రేష్ట నిరంజన సాయి విఘ్నతలు ముఖ్యఅతిథి రామారావు లకు “షీరోస్” పుస్తకాన్ని అందించారు.
ఒక మంచి సామాజిక కార్యక్రమంలో పాల్గొనేలా విద్యార్థులు ముందుకు రావడం అభినందనియమని తెలిపారు, అలాగే మరో అదితి పోతు కంటి నాగేశ్వరరావు సలహా మేరకు తేజ విద్యాలయ చిన్నారులచే సంక్రాంతి పండుగ నాటికి 1000 పుస్తకాలను సేకరించి కొమరబండ లో నూతనంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ సోమిరెడ్డి ప్రకటించారు అనంతరం ముఖ్య అతిథిని డైరెక్టర్ సోమిరెడ్డి శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు.