Ramachander Rao: ప్రజా దీవెన, కోదాడ :పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను పారదర్శకంగారూపొందించనున్నట్లు కోదాడ ఎంపీడీవో రామచందర్ రావు (Ramachander Rao)తెలిపారు.గురువారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ,తుది ఓటర్ల జాబితా (List of Voters)రూపకల్పనపై మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించారు.జాబితాపై (list)ఈనెల 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఎటువంటి అభ్యంతరాలు ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శులను కలిసిసవరణచేసుకోవాలన్నారు.తదుపరి డిపిఓ ఆదేశాల మేరకు ఈనెల 28న వార్డుల వారిగా తుది జాబితాను ప్రచూరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాండు, కాంగ్రెస్ పార్టీ (MPO Pandu, Congress Party)మండల అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవూరి వెంకటాచారి, తొండపు సతీష్,తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుగండ్ల శ్రీను, జనపనేని కృష్ణ, వేమూరి సురేష్,జనసేన నాయకులు కస్తూరి సురేష్, కొల్లు నవీన్ తదితరులు పాల్గొన్నారు……