— శ్రీమద్భాగవతం-పార్ట్ 1చిత్రీ కరణ ప్రారంభోత్సవo లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఫిల్మ్ సిటీలో శ్రీమద్భాగవతం చిత్రీకరణ తెలంగాణకు గర్వకారణ మని తెలంగాణ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని ఎంతో అద్భుతంగా నిర్మించా రని ప్రశంసించారు. తాను యూనివ ర్సల్ స్టూడియోను చూడలేదని, కా నీ రామోజీ ఫిల్మ్ సిటీ మాత్రం దేశం లోనే ప్రత్యేకమైన స్టూడియో అని కొనియాడారు.రామోజీ ఫిల్మ్ సిటీ లో ‘శ్రీమద్భాగవతం-పార్ట్ 1’ చిత్రీ కరణ ప్రారంభోత్సవానికి హాజర య్యారు. సాగర్ పిక్చర్ ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోం ది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామాయణం, మహా భారతం మన జీవితాల్లో భాగమని వ్యాఖ్యానించారు. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉందని చెప్ప డానికి గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ అందరికీ చేరువైందని, కరోనా సమయంలో మళ్లీ ఆ సీరి యల్‌ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికా ర్డు సృష్టించిందని గుర్తు చేశారు. 20 35 నాటికి తెలంగాణను ఒక ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలని సంకల్పించామని ముఖ్య మంత్రి అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నా మని తెలిపారు.
ఇందుకోసం విజన్ 2047 డాక్యు మెంట్ సిద్ధం చేసుకున్నామని, అం దులో సినిమా రంగానికి ప్రత్యేక అ ధ్యాయం ఉందని వెల్లడించారు. రామానంద్ సాగర్ నాడు తీసిన ‘రామాయణం’ సీరియల్ ఎంతటి విజయం సాధించిందో, ఇప్పుడు శ్రీమద్భాగవతం కూడా అంతే విజ యం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద కుమార్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.