వెంకటరమణ ట్రాన్స్ పోర్ట్ ముస్లిం సిబ్బందికి తోఫా పంపిణీ
ramzantohfa: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరిం చుకొని వెంకటరమణ లారీ ట్రా న్స్ పోర్ట్ అధినేత, పౌరసరఫరాల శాఖ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కందు ల వెంకటరమణ గౌడ్ తన వద్ద పనిచేసే ముస్లిం కుటుంబ సభ్యు ల కు తోఫా పంపిణీ చేశారు. ఆది వారం నల్లగొం డ కలెక్ట రేట్ సమీ పం లోని తన నివాసంలో ఆదివారం తమ సంస్థల్లో పని చేసే డ్రైవ ర్లు, సిబ్బందికి సంప్రదాయం ప్రకారం తోఫా పేరిట పంపిణీ చేసే వ స్తు వులను అందజేశారు.
ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ యజమాని కందుల వెంకటరమణ గౌడ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పర్వ దినం సందర్భంగా ప్రతి ఏడాది తమ వద్ద పని చేసే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఆనవాయితీగా తోఫా పంపిణీ చేయడం జరుగు తుందని తెలిపారు. రంజాన్ నెలలో ఆచరిం చాల్సిన ఆచారాల మేర కు నిరుపేద ముస్లిం కుటుంబాలు సంతో షంగా రంజాన్ ఈద్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ( నిత్య వసర సరుకులు) కూడా ఆనవా యితీగా అందిస్తున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో వెంకటర మణ ట్రాన్స్ పోర్ట్ అధినేత కుటుంబ సభ్యు లు కూడా పాల్గొన్నారు.