–సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
Rape : ప్రజాదీవెన , నల్గొండ : జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాలలో ఆశ వర్కర్ విధులు ముగించుకుని వస్తున్న సందర్భంలో అత్యాచారాని కి ఒడిగట్టిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని, అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఆశా వర్కర్ కు ఇంటి స్థలంతో పాటు, ఇల్లు నిర్మించి బాధితురాలికి నష్టపరిహారంగా కింద ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ లకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు.
మెడికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొంత ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.అత్యాచారాలకు కఠిన శిక్షలు పడేవిధంగా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు రోజులు ముందే ఇలాంటి సంఘటనలు జరగడం మహిళలకు ఏ పాటి రక్షణ ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.