*కుక్క పొదుగులో మూడు కిలోల కణతుల తొలగింపు
*పదివేల కేసుల్లో ఒకటి లేదా రెండు కేసుల్లో మాత్రమే ఇలాంటి కణితల నమోదు.
Rare surgery: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన జూలూరు కృష్ణ పెంపుడు శునకం (DOG) గత కొన్నాళ్లుగా పొదుగుకి కణతులై రోజురోజుకూ పెరిగి పొదుగు అంతటా వ్యాపించి ఒకవైపు కణితి పగిలి రక్తం కారుతూ నొప్పులతో విపరీతంగా బాధపడుతుండగా శుక్రవారం ప్రాంతీయ పశువైద్యశాల (Veterinary Hospital)కోదాడలో చూపించారు.ప్రాంతీయపశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శునకాన్ని పరిశీలించి ఇప్పటికే పొదుగు అంతా వ్యాపించిన కణితులు ఆలస్యం చేయకూడదని శస్త్ర చికిత్స తక్షణ అవసరంగా గుర్తించి కుక్కల శస్త్ర చికిత్సలో (Canine surgery)నిపుణులైన అసిస్టెంట్ డైరెక్టర్ డా. రూపకుమార్ ని పిలిపించి మూడుగంటల పాటు శ్రమించి కుక్కకి శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా మూడుకిలోలు ఉన్న కణుతులను తొలగించి కుక్కికి జీవితాన్ని పొడిగించారు శస్త్రచిత్స అనంతరం యజమాని , కుటుంబ సభ్యులు అమితానందంతో తమ నేస్తాన్ని చూసుకొని సంతోషించారు శస్త్రచికిత్సలో సిబ్బంది రాజు , చంద్రకళ , ప్రశాంత్ పాల్గొన్నారు.