— మీడియా సమావేశంలో జిల్లా బిఆర్ఎస్ నేతల స్పష్టీకరణ
BRS RavindraKumar : ప్రజా దీవెన, నల్లగొండ: పండగ ప్రయాణాలు రహదారుల రద్దీ తదితర కారణాలతో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నా ను అనివార్యంగా వా యిదా వేసినట్లు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ తెలి పారు. శనివారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య, మాజీ జెడ్పీ చైర్మ న్ బండ నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని రైతు భరోసా 15 వేల నుంచి 12 వేలకు తగించారని ఆరోపించారు. కేటీఆర్ ఈ ఫార్ము లా పేరుతో కేసుల కుట్రలు. లగచర హైడ్రా, మూసి లాంటి అంశాల్లో ప్రజ ల పక్షాన కేటీఆర్ పోరాటాన్ని సహించలే క అక్రమ కేసులు పెడు తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వా న్ని ప్రశ్నిస్తే కేసుల్లో ఇరికించాలని చుస్తునారని ఆరోపించారు. సమగ్ర శిక్ష సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్ వాడి సిబ్బంది, ఆటో వర్కర్స్ సమ స్యలు సర్కార్ కు పట్టడం లేదన్నా రు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పు డు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలను చేసింది ఇదే రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ప్రజా పరి పాలనపై దృష్టి పెట్టాలి కానీ కేసు లపై కాదని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సీజన్లో భరోసా ఇస్తారా లేదో చెప్పాలని స్థానిక ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు. కెసిఆర్ వ్యవసాయ కుటుంబానికి ధైర్యం ఇచ్చారని గుర్తు చేశారు. ఆరు గ్యా రంటీ లు, 420 హామీలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చేసిందేమి లేదన్నారు. మొదట రైతులకే వెన్నుపోటు పొడుస్తుంద న్నారు.2 లక్షల రుణమాఫీ, పంటల కు రూ. 15000 రైతు భరోసా, మూ డు పంటలకు భరోసా, కౌలు రైతులకు కూడా భరోసా లాంటి ఎన్నో హామీలు ఇచ్చారని తెలి పారు. కానీ నేటికీ వీటిలో ఏవీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో రేవం త్ రెడ్డి దేవుళ్లపై ప్రమానం చేస్తూ అందరికీ రుణమాఫీ చేస్తా అన్నా డు. కానీ జిల్లాలో 30 శాతం మాత్ర మే రుణమాఫీ జరిగిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా ఇస్తామని చెప్తు న్నా రు. కానీ అది కూడా 15 వేల కాకుండా 12 వేలే ఇస్తారు అట.12 వేలు ఇచ్చి భరోసా అయిపొయింది అంటే కుదరదాని ప్రశ్నించారు. 15 వేలు ఇస్తేనే భరోసా అనుకుంటారు. కానీ 12 వేలు ఇస్తే కేసీఆర్ రైతు బందు నే అవుతుంది. రుణమాఫీ, భరోసాపై ప్రభుత్వ తీరుపై పోరాటా నికి బిఆరెస్ సిద్దం అన్నారు. నకిరే కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య మాట్లాడుతూ కేటీఆర్ మీద ఈ ఫార్ముల కేసు, లగచర్ల ఇష్యూ లోను ఇరికించాలని ప్రయత్నం చేశా రని, కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో పార్టీ చేస్తే కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.కానీ కెసిఆర్ హయాంలో పదేండ్లు ప్రజాస్వామ్యం బద్దంగా పాలన సాగింది. కానీ ఏడాది కాలంలోనే అనేక కేసులు పెట్టి వేదిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలతో సహా కింది స్థాయి కార్యకర్తల వరకు కేసుల భాధితులు ఉన్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి కుటుంబ పాలన రాష్ట్రంలో సాగుతుంది. కుటుంబ పాలన తో ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నావ్ అని ప్రశ్నించారు. రుణమాఫీ కాలే దు. మహిళలకు 2500 అడ్రెస్స్ లేవు. పెన్షన్స్ లేవు. రైతు భరోసా కు కోత పెట్టరు. పండించిన ధాన్యా న్ని కొనే దిక్కు లేదు.హాస్టల్స్ పిల్ల లు చనిపోతే పట్టింపు లేదు, చంద్ర బాబు, బీజేపీ కనుసన్నుల్లో పాలన సాగిస్తుబీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగ లుగా వ్యవహారిస్తున్నారు. సమావే శంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరం జన్ వలి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, మాజీ ఎంపీపీ కరీం పాషా, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.