— మాజీ ఎమ్మెల్యే లు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్, కంచర్ల
Ravindra Kumar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెం టర్ లో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో మంగళవారం నిర్వహించ తల పెట్టిన రైతు మహాధర్నా ఏర్పాట్లను బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రవీం ద్ర కుమార్, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డిలు సోమవారం సా యంత్రం పరిశీలించారు. బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ రైతు మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బిఆర్ఎ స్ పార్టీ జిల్లా నేతలు ఇప్పటికే ము మ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన విష యం తెలిసిందే.
ఈ క్రమంలో ధర్నా ఈ ఏర్పాట్ల ను జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి లు నాయకులు ఒం టెద్దు నరసింహారెడ్డి, స్థానిక నేతల తో కలిసి పరిశీలించి పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా అమలు చేస్తున్న నిర్ణ యాలు రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా హర్షించడం లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని దుయ్య బట్టారు. చెప్పిన అన్ని పథకాలను అన్ని వాయిదాలు వేస్తూ చివరకు వాయిదాల ప్రభుత్వంగా పేరు చే సుకుందని మారిందన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం రైతు అనుకూ లంగా మేలు చేసే అనేక నిర్ణయా లు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింద ని అందుకు నిరసనగా రైతుకు వె న్నుదన్నుగా నిలిచేoదుకు కేటీఆర్ నల్లగొండలో రైతు మహా ధర్నా నిర్వహించాలని నిరయించారని తెలిపారు.
రైతుకు న్యాయం చేయాలని బాధ్యతగా నల్లగొండ లో బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్య క్రమాన్ని తలపెడితే స్థానిక మంత్రి తో పాటు కాంగ్రెస్ నాయకులు ధర్నా కు విఘాతం కల్గించేందుకు పలు అడ్డంకులు సృష్టించి ధర్నాకు అనుమతి నిరాకరించారని గుర్తు చేశారు. అందుకు తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయించామని, గౌరవ హైకోర్టు వారు ధర్నాకు అనుమ తించారని చెప్పారు. కోర్టు సూచ నల మేరకు ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తామని అధికారులు, పోలీ సులు తమకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. వారి వెంట నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య, కొం డూరు సత్యనారాయణ, లొడంగి గోవర్ధన్ జమాల్ ఖాద్రి, రావుల శ్రీనివాస్ రెడ్డి మెరుగు గోపి, తవిటి కృష్ణ ,నారగోని నరసింహ, డి రామ్రెడ్డి, కంకణాల వెంకటరెడ్డి, షరీఫ్ తదితరులు ఉన్నారు.