Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rayapudi Chini: పి డి ఎస్ యు అర్థ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి: రాయపూడి చిన్ని

Rayapudi Chini: ప్రజా దీవెన, కోదాడ: పిడిఎస్ యు అర్థ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోనిలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School) నేడు నిర్వహించనున్న పూర్వా ప్రస్తుత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ పూర్వ విద్యార్థి నాయకులు రాయపూడి చిన్ని పందిరి నాగిరెడ్డిలు (Rayapudi Chinni Pantri Nagi Reddys)పేర్కొన్నారు.

శనివారం స్థానిక మండల సహకార కళాశాలలో ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.. ఆత్మీయ సమ్మేళనానికి పౌర హక్కుల ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం ప్రధాన వక్తగా హాజరుకానున్నారని పేర్కొన్నారు జార్జిరెడ్డి అమరత్వంతో జంపాల చంద్రశేఖర్ శ్రీపాద శ్రీహరి రంగవల్లి (Sripada Srihari Rangavalli) మారోజు వీరన్న తదితర విద్యార్థుల ప్రేరణతో పిడిఎస్యు శాస్త్రీయ విద్యా విధానంతో పాటు సామాజిక సమస్యలపై పోరాడిందని పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామిక వాదులు హాజరై ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో పి డి ఎస్ యు ప్రస్తుత విద్యార్థులు రాఘవరెడ్డి అప్పి రెడ్డి నరసింహారావు ఉదయగిరి హరి కిషన్ రావు (Hari Kishan Rao) చందర్రావు ఉదయ్ పులి రాకి. వేణు తదితరులు పాల్గొన్నారు.