Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rayapudi Venkateswara Rao: విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి.

Rayapudi Venkateswara Rao: ప్రజా దీవెన, కోదాడ: విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉత్తమపౌరులుగాతీర్చిదిద్దబడతారని పి డి ఎస్ యు పూర్వ విద్యార్థి రాష్ట్ర నేత రాయపూడి వెంకటేశ్వరరావు (Rayapudi Venkateswara Rao)పేర్కొన్నారు.. పి డి ఎస్ యు అర్థ శతాబ్ది (PDSU half century) ఉత్సవాలను పురస్కరించుకొని కోదాడలో ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాలల్లో వాలీబాల్ పోటీలను (Volleyball competitions) నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ పూర్వ విద్యార్థులుపెదనాటి వెంకటేశ్వర్లు. ముత్తవరపు పాండురంగారావు పందిరి నాగిరెడ్డి. పారా సీతయ్య లు పాల్గొని ఈ సందర్భంగా క్రీడాకారులను (of sportsmen) ఉద్దేశించి మాట్లాడుతూ జార్జి రెడ్డి అమరత్వంతో ఆవిర్భవించిన పి డి ఎస్ యు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఉద్యమించడంతోపాటు సామాజిక సమస్యలపై పోరాటం చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులకందాల్సిన ఉపకార వేతనాలు.

హాస్టల్ సమస్యలు. విద్యార్థినుల పై (female students) వేధింపులు తదితర సామాజిక అంశాలపై పోరాటం చేసిందన్నారు.. దీంతోపాటు పౌర హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ పి డి ఎస్ యు విద్యార్థులు తమ బాధ్యత నిర్వర్తించారని తెలిపారు పాశ్చాత్య విష సంస్కృతి అంటు వ్యాధుల వ్యాపిస్తున్న నేటి పరిస్థితులు విద్యార్థులు సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మట్టారెడ్డి పాకనాటి రాఘవరెడ్డి o(female students) డిఎన్ స్వామి రాపర్తి రామ నరసయ్య ఎన్ హరి కిషన్ రావు (Kishan Rao). కోటయ్య మస్తాన్ జూలూరి వీరభద్రం నాయిని మల్లయ్య. ఉదయగిరి వి నరసింహారావు చందర్ రావు పూర్వ ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు…