RCO :ప్రజాదీవెన , నల్గొండ టౌన్ : నల్లగొండ జిల్లా పెద్దవూర గిరిజన గురుకుల పాఠశాలలో నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న చందంపేట మండలం మూడుదండ్ల గ్రామనికి చెందిన లోకసాని సుధాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తునే ఈనెల 16న మరణించారు.
కాగా గురువారం గిరిజన గురుకుల ఆర్సిఓ ఇస్లావత్ బలరాం నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు దహన సంస్కరణ నిమిత్తం 20 వేలు అందజేశారు.అతనికి వచ్చే బెనిఫిట్స్ అన్ని గురుకుల అధికారులతో మాట్లాడి వారి కుటుంబానికి అందే విధంగా చూస్తామని, కుటుంబ సభ్యులకు అండదండగా ఉంటామని భరోసానిచ్చారు.
అతని మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిజేశారు. ఈ కార్యక్రమంలో
ఆర్సిఓ తో పాటు పెద్దవూర గురుకుల ప్రిన్సిపాల్ మంగ్త భూక్యా, గ్రామ నాయకులు నీలియ్య నాయక్, గురుకుల టీచర్లు ఎం.తిరుపతి రెడ్డి ఏ.వెంకట్ రెడ్డి, పి.లింగారెడ్డి, కే.వినయ్ కుమార్, సూపరింటెండెంట్ చింత నవీన్ కుమార్, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.