–యూరియాను ఎమ్మార్పీ రేట్ కి అమ్మాలి
–యూరియాకు ఇతరత్రా ఎరువులు లింకు పెట్టరాదు
–ఆర్డీవో వేణు మాధవ్
RDO Venu Madhav : ప్రజా దీవెన తుంగతుర్తి : ఎరువుల దుకాణదారులు యూరియాను ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగించాలని సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవ్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు యూరియాను అధిక ధరలకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్పీ రేటుకు మించి అమ్మ రాదని అన్నారు.
అలాగే యూరియాకు ఇతర ఎరువులేవి కూడా లింకు పెట్టరాదని అన్నారు. రైతులు దుకాణదారుల నుండి విధిగా బిల్లులు తీసుకోవాలని అన్నారు దుకాణా దారులు కచ్చితంగా యూరియా స్టాక్ ను చూపించాలని యూరియా స్టాకులను ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్లు నమోదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంట తుంగతుర్తి తాసిల్దార్ దయానందం తదితరులు ఉన్నారు.